బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించిన Flipkart..!!

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద సేల్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ప్రకటించింది

ఈ సేల్ జూలై 23 నుండి ప్రారంభమవుతుంది

Flipkart ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను ప్రకటించింది

బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించిన Flipkart..!!

ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద సేల్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ప్రకటించింది. ఈ సేల్ జూలై 23 నుండి ప్రారంభమవుతుంది మరియు జూలై 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎప్పటిలాగానే Flipkart ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా డీల్స్ మరియు ఆఫర్ల వివరాలను కూడా వెల్లడించింది. ముఖ్యంగా, బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు తెలిపింది. మరి ఈ సేల్ నుండి ఎటువంటి డీల్స్ మరియు ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ తీసుకురాబోతోందో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను Axis, Citi మరియు Kotak బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. అందుకే, ఈ మూడు బ్యాంక్స్ కార్డ్స్ తో ప్రోడక్ట్ లను కొనుగోలు చేసే వారికి జనరల్ డిస్కౌంట్ తో పాటుగా 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 70% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజింగ్ ద్వారా చెబుతోంది. అలాగే, స్మార్ట్ వాచ్ లను గరిష్టంగా 60% డిస్కౌంట్ తో, ల్యాప్ టాప్ ల పైన కూడా గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపించింది.

ఇక కొనుగోలుదారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఇతర ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo