Flipkart Big Saving Days: భారీ ఆఫర్లతో సేల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ మరొకసారి తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది
Flipkart Big Saving Days Sale టీజింగ్ కూడా మొదలుపెట్టింది
ఎలక్ట్రానిక్స్ పైన 80% వరకూ మరియు టీవీల పైన 75% వరకూ భారీ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ మరొకసారి తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది . ఈ Flipkart Big Saving Days Sale ను భారీ ఆఫర్లతో తీసుకువస్తునట్లు ఇప్పటికే టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ ఫ్లిప్‌కార్ట్ అప్ కమింగ్ సేల్ మార్చ్ 12 వ తేదీ నుండి మార్చ్16 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ పైన 80% వరకూ మరియు టీవీల పైన 75% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ గురించి టీజింగ్ చేస్తున్న ద్వారా మరిన్ని వివరాలను చూడవచ్చు.
Surveyఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఈసారి SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, SBI క్రెడిట్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కొనుగులుదారులకు సేల్ డిస్కౌంట్ తో పాటుగా 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి నుండి స్మార్ట్ వాచ్ లను గరిష్టంగా 60% డిస్కౌంట్ తో, ల్యాప్ టాప్ ల పైన కూడా గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపించింది.
ఇక కొనుగోలుదారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile