Flipkart Sale: అప్ కమింగ్ సేల్ Big Deal రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Flipkart Big Saving Days జనవరి 15 నుండి స్టార్ట్ అవుతుంది
ఈ సేల్ నుండి అందించనున్న బిగ్ డీల్ ను ముందే అనౌన్స్ చేసింది
ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజ్ ద్వారా అందించిన వివరాలు
Flipkart అప్ కమింగ్ సేల్ Big Saving Days ఎల్లుండి నుండి స్టార్ట్ అవ్వనుండగా, ఈ సేల్ నుండి అందించనున్న బిగ్ డీల్ ను ముందే అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజ్ నుండి అందించిన వివరాలు ప్రకారం, Samsung యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ ను 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో ఈ Flipkart Salle నుండి సేల్ చేయనున్నట్లు టీజ్ చేస్తోంది. అంటే, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ న్నుండి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే పొందేవీలుంది. ఈ అఫర్ గురించి ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజ్ ద్వారా అందించిన వివరాలు ఏమిటో చూద్దామా.
SurveySamsung Galaxy S21 FE 5G: ధర మరియు ఆఫర్లు
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ.49,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, Flipkart Big Saving Days నుండి 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.34,999 అఫర్ ధరకే సేల్ చేయనున్నట్లు టీజ్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ ఫోన్ ను Citi మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా అందుతుంది.
Samsung Galaxy S21 FE 5G:స్పెక్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 FE 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు ప్రోసెసర్ Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,12MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 8MP (OIS) టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile