Flipkart Big Diwali Sale: ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవుతుంది
Flipkart Big Diwali Sale
ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి మొదలవుతుంది
దివాళీ సేల్ నుండి కూడా బిగ్ డీల్స్
Flipkart The Big Billion Days ముగిసిన తరువాత ప్రకటించిన మరొక అతిపెద్ద సేల్ Flipkart Big Diwali Sale.ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి మొదలవుతుంది. ఈ దివాళీ సేల్ ను భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు మరిన్ని భారీ ఆఫర్లతో తీసుకువస్తునట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. Flipkart గత సేల్ నుండి భారీ డీల్స్ అందించింది. అదేవిధంగా, దివాళీ సేల్ నుండి కూడా బిగ్ డీల్స్ అందిస్తుంది. Flipkart Big Diwali సేల్ అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 23 వరకూ అందుబాటులో ఉంటుంది.
Surveyఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, మొబైల్స్ మరియు ట్యాబ్ లెట్స్ పైన గరిష్టంగా 80 డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఇక TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) విషయానికి వస్తే, వీటిపైన కూడా గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది చెబుతోంది. ఈ దివాళీ సేల్ ను SBI భాగస్వాయ్యంతో నిర్వహిస్తోంది కాబట్టి SBI కార్డ్స్ మరియు EMI అప్షన్ పైన 10% అధనపు డిస్కౌంట్ అఫర్ కూడా వర్తింప చేసింది.
అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ నుండి బట్టలు, బూట్లు మరియు మరిన్ని ఫ్యాషన్ వస్తువుల పైన కూడా భారీగానే డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా టీజింగ్ మొదలు పెట్టింది. దీపావళి సందర్భంగా ప్రకటించిన ఈ సేల్ మరిన్ని డీల్స్ ప్రకటించే అవకాశం వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile