మరొకసారి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించిన Flipkart
Flipkart మరొకసారి Big Billion Days సేల్ ను ప్రకటించింది
కొనుగోలుదారులకు మరిన్ని లాభాలతో తీసుకువస్తోంది
ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అఫర్ చెయ్యనున్న ఆఫర్ల గురించి వెల్లడించింది
Flipkart మరొకసారి Big Billion Days సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ను గతంలో తీసుకువచ్చిన మాదిరిగానే భారీ ఆఫర్లు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా కొనుగోలుదారులకు మరిన్ని లాభాలతో తీసుకువస్తోంది. 2022 సంవత్సర పండుగ సీజన్ హడావిడి మొదలవుతుండగానే ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ముందుగానే ప్రకటించింది. Flipkart యొక్క ఈ అతిపెద్ద సేల్ నుండి కొనుగోలుదారుల కోసం భారీ డీల్స్ ను కూడా తీసుకువస్తున్నట్లు ఇప్పటికే తీసుజింగ్ ను కూడా మొదలుపెట్టింది. అయితే, ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించనున్న డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించిలేదు.
Surveyడేట్ ను ఇంకా ప్రకటించనప్పటికీ, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అఫర్ చెయ్యనున్న ఆఫర్ల గురించి మాత్రం వెల్లడించింది. Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు చెబుతోంది. ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలుస్తోంది.
అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. అదేవిధంగా, ఫ్లిప్ కార్ట్ పే లేటర్, ఇన్స్టాంట్ క్రెడిట్ మరియు సులభమైన ఈజీ EMI అప్షన్ ను కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile