FlipKart బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభవుతుంది!
Flipkart Big Billion days 2022 sale నిర్వహించనున్న తేదీని ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
సెప్టెంబర్ 23 నుండి సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ డేట్ ను అనౌన్స్ చేసింది
చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లను కూడా అందివ్వనున్నట్టు కూడా Flipkart ప్రకటించింది
Flipkart Big Billion days 2022 sale నిర్వహించనున్న తేదీని ప్రకటించిన ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ ను సేల్ ను సెప్టెంబర్ 23 నుండి సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ ను Axis మరియు ICICI భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది మరియు చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లను కూడా అందివ్వనున్నట్టు కూడా ప్రకటించింది. ముఖ్యంగా, ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి ఫ్లిప్ కార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన 80% గరిష్టంగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెబుతోంది. కాబట్టి, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ నుండి ఏ ప్రోడక్ట్స్ పైన ఎటువంటి అఫర్ లను అందించనున్నదో చూద్దాం.
Surveyవాస్తవానికి, Flipkart అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ యొక్క డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఏ కేటగిరి ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా ఎంత వరకూ డిస్కౌంట్ అఫర్ చెయ్యనున్నది, అనే విషయాన్ని మాత్రం మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. దీని ప్రకారం, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. అలాగే, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన కూడా గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెబుతోంది. మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంటే, ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలుస్తోంది.
అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. అదేవిధంగా, ఫ్లిప్ కార్ట్ పే లేటర్, ఇన్స్టాంట్ క్రెడిట్ మరియు సులభమైన ఈజీ EMI అప్షన్ ను కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile