Flipkart BBD Sale starts from today night for black and
ఆన్ లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Flipkart BBD Sale, అదేనండి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మళ్లీ వచ్చేసింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్ తో పాటు ఎన్నో కేటగిరీల పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్ అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కానీ, ఈ సేల్ ముందస్తు యాక్సెస్ కొంతమంది ప్రత్యేక యూజర్లకు ఈ బిగ్ డీల్స్ ఈరోజు రాత్రి నుంచే మొదలవుతాయి.
సాధారణ కస్టమర్ల కంటే ముందుగానే షాపింగ్ చేసుకోవడానికి కొంత మంది యూజర్లకు ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఫ్లిప్ కార్ట్ Black మరియ్ ఫ్లిప్ కార్ట్ Plus సభ్యులకు ఈ సేల్ యాక్సెస్ ముందుగానే అందిస్తుంది. అంటే, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచే స్టార్ట్ అవుతుంది.
ఫ్లిప్ కార్ట్ లో బ్లాక్ మరియు ప్లస్ సభ్యత్వం ఉన్న కస్టమర్లు సాధారణ యూజర్ల కంటే ముందుగానే Big Billion Days డీల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. అంటే, మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, టీవీలు వంటి ప్రొడక్ట్స్ స్టాక్ అయిపోక ముందే ఈ ప్రత్యేకమైన యూజర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఈ ముందస్తు ఉపయోగకరంగా ఉండవచ్చు.
బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా పలు కేటగిరీల్లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అదనంగా, ఈ సేల్ నుంచి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బోనస్, అదనపు డిస్కౌంట్లతో కొన్ని ప్రోడక్ట్స్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read: AI Guardrails vs AI Safety: సురక్షితమైన AI ని నిర్దేశించే ఈ రెండింటి అసలు తేడా ఏమిటి?
ఈ సేల్ నుంచి అందించనున్న బెస్ట్ డీల్స్ ను చాలా రోజులు ముందు నుంచే టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్ కేటగిరిలో, ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్ ఫోన్, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్ మరియు రియల్ మీ P4 పవర్ వంటి చాలా స్మార్ట్ ఫోన్స్ పై బిగ్ డీల్స్ అందుకోవచ్చు
సౌండ్ బార్ కేటగిరిలో కూడా చాల డీల్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా, జెబ్రోనిక్స్ లేటెస్ట్ 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బిగ్ డీల్స్ తో అతి చవక ధరలో అందుకోవచ్చు. ఇదే కాదు Sony, LG, JBL మరియు Samsung బ్రాండ్స్ అందించిన లేటెస్ట్ సౌండ్ బార్స్ పై కూడా బెస్ట్ డీల్స్ అందుకోవచ్చు.