AI Guardrails vs AI Safety: సురక్షితమైన AI ని నిర్దేశించే ఈ రెండింటి అసలు తేడా ఏమిటి?
కృత్రిమ మేధస్సు (ఏఐ) మన రోజువారీ జీవితంలోకి చాలా వేగంగా ప్రవేశిస్తోంది
సురక్షితమైన AI ని నిర్దేశించేవిగా ఏఐ గార్డ్‌రైల్స్ మరియు ఏఐ సేఫ్టీ ఫీచర్స్ గురించి చెబుతారు
ఈ రెండింటి అసలు తేడా ఏమిటో వివరంగా తెలుసుకుందాం
AI Guardrails vs AI Safety: కృత్రిమ మేధస్సు (ఏఐ) మన రోజువారీ జీవితంలోకి చాలా వేగంగా ప్రవేశిస్తోంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం నుంచి క్లిష్టమైన కోడ్ రాయడం వరకు, వైద్య సమాచారాన్ని విశ్లేషించడం నుంచి కస్టమర్ సర్వీస్ నిర్వహించడం వరకు, అనేక మార్గాలకు AI సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి. అయితే, ఏఐ ఎంత శక్తివంతంగా మారుతుందో అంత ప్రమాదం మారే అవకాశం ఉందని ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. వినియోగంలో భద్రత, నియంత్రణ, బాధ్యత వంటి ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, సురక్షితమైన AI ని నిర్దేశించేవిగా ఏఐ గార్డ్‌రైల్స్ మరియు ఏఐ సేఫ్టీ ఫీచర్స్ గురించి చెబుతారు. సురక్షితమైన ఏఐ ని నిర్దేశించే ఈ రెండింటి అసలు తేడా ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
SurveyAI Guardrails vs AI Safety: ఏమిటి ఇవి?
ఏఐ గార్డ్‌రైల్స్ మరియు ఏఐ సేఫ్టీ రెండూ కూడా ఏఐ ని సురక్షితంగా ఉపయోగించడానికి సంబంధించిన మార్గాలు. అయితే, ఈ రెండింటి అర్థం ఒకటి కాదని గమనించాలి. ఏఐ గార్డ్‌రైల్స్ అనేవి ఏఐ ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అనే హద్దులను నిర్దేశించే నియంత్రణ రేఖ. ఇక ఏఐ సేఫ్టీ అనేది ఏఐ వల్ల కలిగే ప్రమాదాలు గుర్తించడం, తగ్గించడం మరియు నిర్వహించడం అనే విస్తృత ప్రక్రియ. అంటే, ఈ రెండు చేసే పనుల్లో చాలా వ్యత్యాసం ఉంది.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అంటే ఏఐ గార్డ్‌రైల్స్ అనేవి ఏఐ సేఫ్టీ లో ఒక ముఖ్యమైన భాగం. కానీ ఏఐ సేఫ్టీ పరిధి అంతకంటే చాలా పెద్దదని చెబుతాను.
AI Guardrails అంటే ఏమిటి?
రోడ్డుపై పయనించే వాహనం ప్రమాదకరంగా బయటకు వెళ్లకుండా రోడ్డుకు ఇరువైపులా నిర్మించే రక్షణ కంచె ను గార్డ్‌రైల్స్ అంటారు. ఏఐ లో కూడా ఇది అదే పని చేస్తుంది. ఏఐ వ్యవస్థకు కొన్ని నియమాలు, పరిమితులు, ఫిల్టర్లు, నియంత్రణలు విధించే సాంకేతిక లేదా విధానపరమైన చర్యను గార్డ్‌రైల్స్ అంటారు.
ఈ విషయం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక ఏఐ చాట్ బోట్ ను సంస్థ ఉపయోగిస్తోందనుకుందాం, ఆ చాట్ బోట్ హానికరమైన సూచనలు ఇవ్వకూడదు అని నిమయం పెట్టబడుతుంది. అంతేకాదు, వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారాన్ని బయటపెట్టకూడదు, సంస్థ అంతర్గత డేటాను అనధికారికంగా వెల్లడించకూడదు మరియు సమాధానం తెలియకపోతే ఊహించి చెప్పకుండా స్పష్టంగా తెలియజేయాలి అనే నియమాలు ఉంటాయి.
గార్డ్‌రైల్స్ ఎలా పని చేస్తాయి?
ఏఐ గార్డ్‌రైల్స్ అనేవి సిస్టం లోని వివిధ దశల్లో అమలు అవుతాయి. ఇందులో ఇన్ పుట్ గార్డ్‌రైల్స్ అనేది వినియోగదారు ఏఐ కి ఇచ్చే సమాచారాన్ని ముందుగా పరిశీలిస్తాయి, ఏదైనా తప్పుగా ఉంటే నిరాకరిస్తాయి. నెక్స్ట్ అవుట్ పుట్ గార్డ్‌రైల్స్, ఇది ఏఐ ఇచ్చే సమాధానాన్ని వినియోగదారుడికి చూపించే ముందు తప్పుగా ఉందో లేదో అని పరిశీలిస్తాయి మరియు విరుద్ధమైన కంటెంట్ ఉంటే దాన్ని నిరోధించవచ్చు.

అలాగే, ఏ డేటాను యాక్సెస్ చేయాలి మరియు ఏ డేటాను యాక్సెస్ చేయకూడదు అనే విషయాన్ని నియంత్రించే నియమాన్ని డేటా గార్డ్‌రైల్స్ అని అంటారు. ఎవరికి ఏ ఏఐ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి అనే విషయాన్ని యాక్సెస్ గార్డ్‌రైల్స్ నిర్ణయిస్తాయి. మొత్తానికి, యూజర్ కి ఏఐ ని సరైన రీతిలో మాత్రమే వినియోగించడానికి గార్డ్‌రైల్స్ నియమాలు నిర్ణయించబడతాయి.
మరి AI Safety అంటే ఏమిటి?
ఏఐ అనేది చాలా విస్తృతమైన భావన. ఏఐ వ్యవస్థలు సురక్షితంగా, నమ్మదగిన విధంగా మరియు ఊహించదగిన రీతిలో పనిచేసేలా చేయడం ఏఐ సేఫ్టీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో కేవలం chatbot యూజర్లకు ఒక తప్పు లేదా చెడు సమాధానం ఇవ్వకుండా అడ్డుకోవడం మాత్రమే ఉండదు. ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేసే దశ నుంచి దాన్ని వినియోగించే దశ వరకు అనేక అంశాలు ఏఐ సేఫ్టీ పరిధిలోకి వస్తాయి.
ఇందులో సాధారణంగా పరిగణించే అంశాలు:
- తప్పుదోవ పట్టించే లేదా ప్రమాదకరమైన అవుట్ పుట్
- హెల్యుజినేషన్స్
- Bias మరియు discrimination
- ప్రైవసీ
- సైబర్ సెక్యూరిటీ
- మోడల్ మిస్ యూజ్
- అనుకోని ప్రవర్తన
- ఏఐ ఏజెంట్స్ కు అధిక స్వతంత్ర నిర్ణయాధికారం
- మానవ పర్యవేక్షణ
- Robustness మరియు reliability
- ప్రమాదాల పరీక్ష మరియు పర్యవేక్షణ
- ఏఐ వ్యవస్థ విఫలమైనప్పుడు దాన్ని నియంత్రించే విధానాలు
వంటి చాలా పనులు ఇది నిర్వహిస్తుంది. అందువల్ల, ఏఐ సేఫ్టీ అనేది ఒక మొత్తం లైఫ్ సైకిల్ ప్రక్రియగా చూడవచ్చు.
Also Read: Vivo X Fold 6 అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!
AI Guardrails vs AI Safety: ప్రధాన తేడా ఏమిటి?
ఈ రెండింటి మధ్య తేడాను ఒక ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందుకు నేరుగా కాకుండా ఉదాహరణ తో చెప్పడం సులభంగా ఉంటుంది. అదేమిటంటే, మీరు ఒక ఎలివేటర్ ను ఊహించుకోండి. ఎలివేటర్ లో జనాలు ఉన్నప్పుడు తలుపులు మూసుకుపోకుండా చేసే సెన్సార్, ఒక గార్డ్‌రైల్స్ లాంటిది. అది ముందుగానే నిర్ణయించిన నియమంతో ప్రమాదాన్ని జరగకుండా అడ్డుకుంటుంది.
కానీ, మొత్తం ఎలివేటర్ వ్యవస్థ సురక్షితంగా ఉండాలంటే బలమైన కేబుల్స్ ఉండాలి, బ్రేకింగ్ సిస్టమ్ సరిగా పని చేయాలి, విద్యుత్ వ్యవస్థలో రక్షణ ఉండాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో అలారం పని చేయాలి. ఇలా అనేక రక్షణ వివరాలు వుండటమే ఏఐ సేఫ్టీ అని మీరు అర్థం చేసుకోవచ్చు.
ఒక ఏఐ వ్యవస్థలో అనేక గార్డ్‌రైల్స్ ఉన్నప్పటికీ అది పూర్తిగా సేఫ్ అని చెప్పలేం. ఎందుకంటే, గార్డ్‌రైల్స్ సాధారణంగా ముందుగా ఊహించిన కొన్ని పరిస్థితులు మాత్రమే నియంత్రిస్తుంది. కానీ వాస్తవ ప్రపంచంలో ఏఐ వ్యవస్థలు ఎదుర్కొనే సమస్యలు ఎప్పుడూ ముందే ఊహించినట్టు ఉండదు. అయితే, అవి ఏఐ సేఫ్టీ లో ప్రాక్టికల్ రక్షణ పొరగా పనిచేస్తాయి.
ఈ రెండు విషయాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏఐ గార్డ్‌రైల్స్ మరియు ఏఐ సేఫ్టీ రెండూ ఒకే లక్ష్యం వైపు పనిచేస్తాయి. ఇవి కలిసికట్టుగా ఏఐ ని మరింత సురక్షితంగా మరియు నమ్మదగినదిగా చేయడం కోసం కొనసాగుతాయి. కానీ ఏఐ గార్డ్‌రైల్స్ మరియు ఏఐ సేఫ్టీ పరిధి వేరు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
