flipkart announced GOAT Sale with big deals
ప్రముఖ ఇకార్ట్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ తన అతిపెద్ద సేల్ GOAT Sale 2026 అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి భారీ నుంచి అతిభారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకునే అవకాశం ఉందని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ కూడా పోటీగా ఈ కొత్త సేల్ ను అనౌన్స్ చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. అయితే, కస్టమర్లకు మరియు కొనుగోలుదారులు ఇది మంచి అవకాశం గా భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ బిగ్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో తమకు అవసరమైన వస్తువులు చవక ధరలో అందుకునే అవకాశం ఉంటుంది.
గోట్ సేల్ 2026 జూలై 4వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మరియు ప్లస్ మెంబర్స్ కి 24 గంటల ముందు ఈ సేల్ యాక్సెస్ లభిస్తుంది. అంటే, జూలై 3వ తేదీ నుంచి ఈ సేల్ ఫ్లిప్ కార్ట్ బ్లాక్ అండ్ ప్లస్ యూజర్లకు స్టార్ట్ అవుతుంది.
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ కోసం ICICI, BOB Card మరియు HSBC బ్యాంకు లను పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఈ సేల్ నుంచి ఏదైనా వస్తువు ఈ మూడు బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
Also Read: Flipkart Offer: మీ ఇంటిని అదరగొట్టే Soundbar ను కేవలం 4 వేల బడ్జెట్ లో పొందండి.!
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ ఆఫర్లు కూడా టీజర్ పేజీలో అందించింది. వీటిలో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్, రెడ్ మీ ప్యాడ్ 2 ప్రో టాబ్లెట్, శాంసంగ్ గెలాక్సీ S 25 స్మార్ట్ ఫోన్ మరియు లేటెస్ట్ మోటో స్మార్ట్ వాచ్ లను మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీలో చూపించింది.
అంతేకాదు, ఈ సేల్ నుంచి అందించిన బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను కూడా టీజ్ చేసింది. అదేమిటంటే, LG లేటెస్ట్ 43 ఇంచ్ Nano UHD స్మార్ట్ టీవీ డీల్. ఈ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ తో ఊహించనంత చవక ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది.
ఇవి కాకుండా ఫ్యాషన్, బ్యూటీ, టాయ్స్, రిఫ్రిజిరేటర్, AC, సౌండ్ బార్ మరియు యాక్ససరీస్ పైన కూడా ఈ సేల్ నుంచి భారీ డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ భారీగా టీజింగ్ చేసింది. ఈ సేల్ నుంచి అందించే ఆఫర్స్ మరియు అప్ కమింగ్ డీల్స్ తో అందించిన టీజర్ పేజీలో ఒకొక్క డీల్ ను రివీల్ చేసే ఆలోచనలో ఫ్లిప్ కార్ట్ ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త డీల్స్ మరియు సేల్ అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం.