Flipkart Offer: మీ ఇంటిని అదరగొట్టే Soundbar ను కేవలం 4 వేల బడ్జెట్ లో పొందండి.!

HIGHLIGHTS

ప్రస్తుతం చాలా మంది సౌండ్ బార్ ను కూడా ఇంట్లో ఒక ప్రధాన అవసరంగా చూస్తున్నారు

ఒక Soundbar ఉంటే ఇల్లు సినిమా థియేటర్ మాదిరిగా మారుతుంది

కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

Flipkart Offer: మీ ఇంటిని అదరగొట్టే Soundbar ను కేవలం 4 వేల బడ్జెట్ లో పొందండి.!

Flipkart Offer: ప్రస్తుతం చాలా మంది సౌండ్ బార్ ను కూడా ఇంట్లో ఒక ప్రధాన అవసరంగా చూస్తున్నారు. ఎందుకంటే, OTT ల పుణ్యమా అని కొత్త సినిమాలు కూడా ఇంట్లో కూర్చొని చూసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, స్మార్ట్ టీవీ ఉంటే సిరీస్ లు, యూట్యూబ్ లో కామెడీ సీన్స్, సినిమాలు మరియు స్పోర్ట్స్ వంటివి బిగ్ స్క్రీన్ లో ఎంజాయ్ చేయవచ్చు. అయితే, ఒక సౌండ్ బార్ ఉంటే, ఈ సెటప్ మొత్తం సినిమా థియేటర్ మాదిరిగా మారుతుంది. అందుకే, సౌండ్ బార్ ని కూడా ఇంట్లో ఒక ప్రధాన అవసరంగా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Offer: Soundbar ఆఫర్

ఒకప్పుడు సాధారణ సౌండ్ బార్ కొనాలంటే కూడా కనీసం 6 నుంచి 8 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు చాలా ధరలోనే మంచి సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. అందులో, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా గొప్ప బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. వీటిలో కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు ఇక్కడ అందించాము.

Flipkart Offer Soundbar offer

GOVO GO SURROUND 800

ఇది ఫ్లిప్ ఆకృతి నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ అని తడుముకోకుండా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు రూ. 5,499 ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 3,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ప్రైస్ లో ఇది ఆఫర్ చేసే ఫీచర్స్ మాత్రం మతి పోగొడతాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో వస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన లాంగ్ బార్ మరియు గొప్ప బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది HDMI Arc, బ్లూటూత్, USB మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

Also Read: Prime Day 2026 సేల్ నుంచి Sony, LG మరియు Samsung స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!

PHILIPS TAB4361/94

ఇది ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫిలిప్స్ అందించిన పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 67% డిస్కౌంట్ మరియు రూ. 200 అదనపు డిస్కౌంట్ తో కేవలం రూ. 4,799 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది.

ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.5 ఇంచ్ ఉఫర్ డెప్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో చాలా క్లియర్ అండ్ లౌడ్ సౌండ్ మీకు లభిస్తుంది. ఇది ఫుల్ ఫంక్షన్ రిమోట్ మరియు ఫిజికల్ వాల్యూమ్ అండ్ మీడియా బటన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కూడా HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile