అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ఒకే రోజున స్టార్ట్…డీల్స్ ఎలా ఉన్నాయంటే..!
ఈసారి పండగ సేల్ మరింత రసవత్తరంగా మారింది
ఒకేసారి మొదలవుతున్న అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్స్
భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు మరియు మరిన్ని లాభాలు
ఈసారి పండగ సేల్ మరింత రసవత్తరంగా మారింది. ఎందుకంటే, ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్స్ Amazon మరియు Flipkart రెండు కూడా ఒకేసారి తమ పండుగ సేల్స్ ను ప్రకటించాయి. వాస్తవానికి, ముందుగా ఫ్లిఫ్ కార్ట్ తన The Big billion Days సేల్ ను అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 12 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అమెజాన్ మాత్రం అక్టోబర్ 4 నుండి ఈ సేల్ స్టార్ట్ అవుతుందని ప్రకటించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, Amazon మరియు Flipkart రెండు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారాలు నిర్వహించే పండుగ సేల్స్ కూడా అక్టోబర్ 3వ తేదీ నుండి మొదలవుతాయి. పండుగ సందర్భంగా వస్తున్న ఈ సేల్స్ విశేషాలేమిటో చూసేద్దామా..!
SurveyAmazon Great Indian Festival Sale
ఈ సేల్ అక్టోబర్ 3వ తేదీ నుండి మొదలవుతుందని ప్రకటించింది. అమెజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం ప్రధాన పేజ్ బ్యానర్ ద్వారా ఈ సేల్ గురించి టీజ్ చేస్తోంది. ప్రైమ్ మెంబెర్స్ కి ముందుగా ఈ సేల్ యాక్సెస్ అందుతుంది.
ఈ పండుగ సేల్ ని HDFC భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది.
ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ పండుగ సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది. Check Amazon Sale Offers Here
Flipkart The Big Billion days Sale
Flipkart The Big Billion days Sale ఇక ఈ Flipkart సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఇక మొబైల్ ఫోన్ల విషయంలో కూడా మంచి ఆఫర్లను ప్రకటించవచ్చు. ఎందుకంటే, మొబైల్ ఫోన్ల పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ నుండి No cost EMI, మరియు బెస్ట్ Exchange వంటి ఆఫర్లను ప్రకటించింది.
అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. Paytm ద్వారా కొనేవారికి క్యాష్ బ్యాక్ ని కూడా అఫర్ చేస్తోంది. Check Flipkart Sale Offers Here