కరోనా వాక్సిన్ పేరుతో విపరీతంగా సర్కిలేట్ అవుతున్న ఫేక్ మెసేజ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 May 2021
HIGHLIGHTS
  • COVID-19 Vaccine Registration ను టార్గెట్ చేసుకొని కొత్త ఫేక్ SMS

  • ఈ కరోనా వాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫేక్ మెసేజ్ ఏమిటి?

  • నిపుణులు ఏమిచెబుతున్నారో ఒక లుక్కేద్దాం

కరోనా వాక్సిన్ పేరుతో విపరీతంగా సర్కిలేట్ అవుతున్న ఫేక్ మెసేజ్
కరోనా వాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫేక్ మెసేజ్..తెరిచారో...!

భారతదేశంలో అధికంగా నమోదవుతున్న COVID-19 Vaccine Registration ను టార్గెట్ చేసుకొని కొత్త ఫేక్ SMS లను పంపుతున్నారు ఎటాకర్లు. ఈ SMS ను సీరియస్ గా తీసుకొని అందులో చూపించిన విధంగా యాప్స్ లేదా ఇతర వెబ్సైట్ లను ఓపెన్ చేసినట్లయితే ఇల్లు గుల్లవ్వడం ఖాయమని చెబుతున్నారు నిపుణులు. అసలు ఈ కరోనా వాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫేక్ మెసేజ్ ఏమిటి అది తెరిస్తే ఏమవుతుందో, నిపుణులు ఏమిచెబుతున్నారో ఒక లుక్కేద్దాం.

వాస్తవానికి, విషయాన్ని ముందుగా బయటపెట్టింది ESET ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థలో మాల్వేర్ రీసెర్చర్ గా పనిచేస్తున్న లూకాస్ స్టీఫెన్కో. ఈయన తన ట్విట్టర్ అక్కౌంట్ నుండి దీని గురించిన వివరాలను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో, ఒక ఫేక్ SMS యూజర్లను  కరోనా వ్యాక్సిన్ కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్ అఫర్ చేస్తున్నట్లు చెబుతుంది.

ఈ SMS ఉచిత కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒక మాల్వేర్ లింక్ ను సూచిస్తుంది. ఒకవేళ ఇందులో సూచించినట్లుగా యాప్ డౌన్లోడ్ కోసం ఆ లింక్ పైన నొక్కిన తరువత COVID 19 APP పేరుతో చాలా బాగా కనిపిస్తుంది మరియు ఎటువంటి ఫీజ్ లేకుండా 18 పైబడిన వారు ఉచితం కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చూపిస్తుంది. క్రింద Register Now అని చూపిస్తుంది. దాని పైన నొక్కినా వెంటనే మీ ఫోన్ కు సంభందించి అన్ని యాక్సెస్ లను అనుమతించమని కోరుతుంది.

ఇదంతా కూడా మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మాములుగా ఇన్స్టాల్ చేసినట్లే అనిపిస్తుంది. కానీ, దీన్ని ఇన్స్టాల్ చేసిన తరువాత మన ఫోన్ పూర్తిగా ఎటాకర్ల చేతిలోకి వెళుతుంది. అంటే, ఇక మనం అర్ధం చేసుకోవచ్చు మనకు జరిగే నష్టం ఏమిటో.

అయితే, ప్రస్తుతానికి CoWIN మరియు ఆరోగ్యసేతు యాప్ ద్వారా మాత్రం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లను చేపడుతోంది. అందుకే, ఎక్కువగా సర్కిలేట్  అవుతున్న ఇటువంటి ఫేక్ SMS లేదా వాట్స్అప్ మెసేజిలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. లూకాస్ స్టీఫెన్కో చేసిన ఈ ట్వీట్ క్రింద చూడవచ్చు.   

 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: fake coid 19 vaccine registration sms spreading rapidly
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status