మొరాయించిన Facebook, Whatsapp మరియు Instagram ఇబ్బందుల్లో వినియోగదారులు

HIGHLIGHTS

ఈ సమస్య అమెరికా వంటి అనేక దేశాలతో పాటుగా భారత దేశంలో కూడా వెలుగుచూసింది.

మొరాయించిన Facebook, Whatsapp మరియు Instagram ఇబ్బందుల్లో వినియోగదారులు

నిన్న ఫేస్ బుక్, వాట్స్ ఆప్ మరియు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు వీడియో, ఆడియో మరియు ఇమేజిలను పంపించడం మరియు  రిసీవ్ చేసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే,  వాట్స్ ఆప్ చాటింగ్ లో ఎటువంటి సజావుగా నడిచింది మరియు ఇన్స్టాగ్రామ్ లలో పోస్టింగులకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. ఈ సమస్య అమెరికా వంటి అనేక దేశాలతో పాటుగా భారత దేశంలో కూడా వెలుగుచూసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, కొంతమంది వారి అకౌంట్ లకు సంభందించి ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి తమ దృష్టికి వచ్చినట్లు ఫేస్ బుక్ తెలియచేసింది. ఈ వినియోగదారులు తమ వీడియో, ఆడియో మరియు ఇమేజిలను పంపించడం మరియు  రిసీవ్ చేసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యని పరిష్కరించాడనికి తగిన పరిష్కరాలను అందించినట్లు మరియు వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించినట్లు తెలుస్తోంది.

ఫేస్ బుక్, వాట్స్ ఆప్ మరియు ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కానీ, ఈ సమస్య పూర్తిగా పరిష్కరించడం జరిగిందా? లేక ఇంకా కొంత సమయంపడుతుందా అనే విష్యం పైన అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. అయితే, అధిక శాతం మంది వినియోగదారులు, ఈ రోజు ఉదయం నుండి తమ మీడియా ఫైల్స్ పంపించండం ఎటువంటి సమస్య తలెత్త లేదని చెబుతున్నారు.                                  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo