CoronaVirus కు సంబంచిన సమాచారం మరియు సూచనల కోసం చాట్ బోట్ ప్రారంభిచిన Facebook

CoronaVirus కు సంబంచిన సమాచారం మరియు సూచనల కోసం చాట్ బోట్ ప్రారంభిచిన Facebook
HIGHLIGHTS

ప్రజల భద్రత మరియు శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

ఈ సమయంలో ప్రజలకు సహాయపడటానికి, Facebook మరియు దాని అనుబంధిత ఇతర ఆప్స్ మరొక అడుగు ముందుకువేసి, కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 గురించి ప్రామాణికమైన సమాచారాన్ని అందించడానికి వీలుగా మరొక మెసెంజర్ చాట్‌ బోట్‌ను ప్రారంభించాయి.

ఫేస్‌బుక్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు MyGov తో కలిసి, మెసెంజర్‌ పైన కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌ బోట్‌ ప్రజలకు అవగాహన పెంచడానికి, ప్రామాణికమైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి మరియు కరోనా వైరస్ గురించి నకిలీ వార్తలను అందరి ముందు బహిర్గతం చేయడానికి దోహదపడింది.

 

 

ఫేస్ బుక్ వినియోగదారులు కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌ బోట్‌ను యాక్సెస్ చేయడాన్ని ప్రారంభించవచ్చు. అనగా మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు మరియు ఈ చాట్‌బాట్ ద్వారా ప్రామాణికమైన వార్తలు, అధికారిక అప్డేట్ లు, ముందు జాగ్రత్త చర్యలు మరియు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖను చేరుకోవచ్చు.

చాట్‌బోట్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో పనిచేస్తుంది, ఇది రెండు భాషల మద్దతుతో కూడి ఉందని కూడా చెప్పవచ్చు. చాట్‌ బోట్‌ను సంప్రదించడానికి, వినియోగదారులు మైగోవ్ కరోనా హబ్ ఫేస్‌బుక్ పేజీకి వెళ్లి, ఆపై 'గెట్ స్టార్ట్' అని టైప్ చేయడం ద్వారా చాట్ ప్రారంభించవచ్చు, ఇది ప్రశ్నను టైప్ చేయడానికి లేదా తరచుగా అడిగే ప్రశ్నల జాబితా నుండి ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. అడిగిన ప్రశ్నపై ఆధారపడి, వినియోగదారులు ధృవీకరించబడిన సమాచారాన్ని వీడియో, ఇన్ఫోగ్రాఫిక్ లేదా టెక్స్ట్ రూపంలో అందుకుంటారు. ఆరోగ్య, మైగోవ్ మరియు ఫేస్ బుక్ మంత్రిత్వ శాఖ యొక్క ఈ ఉమ్మడి ప్రయత్నం నమ్మకమైన మరియు నమ్మదగిన వారి నుండి సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల భద్రత మరియు శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ మాట్లాడుతూ, "ఈ క్లిష్ట సమయాల్లో, ప్రజలు పేస్ బుక్ అనుబంధ ఆప్స్  స్నేహితులు, కుటుంబం మరియు చుట్టూ ఉన్న సంఘంతో మునుపెన్నడూ లేనంతగా కలిసి ఉండటానికి ఉపయోగిస్తున్నారు. మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము ఈ అవకాశానికి కృతజ్ఞతలు. ప్రజలను సురక్షితంగా మరియు సరైన సమాచారంతో ఉంచడానికి, కరోనా వైరస్ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పంచుకోవడానికి కమ్యూనికేషన్ సాధనాలు మరియు వనరులతో మంత్రిత్వ శాఖలు కృషి చేస్తున్నాయి. దేశం యొక్క ఈ ప్రయత్నాలకు సహాయం చేయడానికి మేము చేయదగిన ప్రతిదాన్ని చేస్తూనే ఉంటాము. "

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo