ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే షోషల్ మీడియా Facebook మరియు చాటింగ్ యాప్ Whatsapp రెండు కూడా ఒక్కసారిగా పనిచెయ్యడం మానేశాయి. భారతీయ కాలమానం ప్రకారం 9 గంటల సమయంలో వినియోగదారులు వారు పంపిస్తున్న మెసేజిలు మరియు చాటింగ్ ఎదుటి వారికీ చేరడం లేదనే విషయాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని రిపోర్ట్ చేశారు. ఇది కేవలం వారి ఒక్కరికే జరిగి ఉండవచ్చని కొందరు భావించారు.
అయితే, తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వాట్సాప్ యాజమాన్యం ఈ సంఘటనకు సంభందించి వివరణ ఇచ్చింది. కొంత మంది వినియోగదారుల వాట్సాప్ అకౌంట్ సరిగ్గా పనిచెయ్యడం లేదని దాని గురించి తమ వద్ద సమాచారం వుందని వెల్లడించింది. అలాగే, తాము వినియోగదారులకు కలిగిన ఈ అసౌకర్యాన్ని తొలగించేందుకు కృషిచేస్తున్నామని కూడా తెలిపింది.
https://twitter.com/WhatsApp/status/1445060216161116168?ref_src=twsrc%5Etfw
అంటే, చాలా త్వరగానే Facebook మరియు Whatsapp పైన కలిగిం ఈ ఇబ్బందిని తొలగించే అవకాశం వుంది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే తలెత్తిన సమస్యకాదు. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఎదుర్కొన్నారు.