flipkart today offered best deals on Dolby Soundbars
ఈరోజు రూ. 5,000 ధరలో పవర్ ఫుల్ Dolby Soundbar డీల్స్ అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలై మంచి అమ్మకాలను సాధించిన సౌండ్ బార్లను సైతం మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ లిస్ట్ నుంచి మంచి ఫీచర్స్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న రెండు బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాము.
ఈ ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ లో GOVO GO SURROUND 800 సౌండ్ మరియు Egate Enigma 315D రెండు సౌండ్ బార్స్ కూడా 5 వేల ధరలో బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ గా నిలుస్తాయి. ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
ఇది గోవో అందించిన బడ్జెట్ సౌండ్ బార్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 75% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ . 4,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా రూ. 5,499 రూపాయల ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు స్పీకర్లు కలిగి ప్రీమియం డిజైన్ కలిగిన ప్రీమియం బార్ మరియు మంచి బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 180W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో బ్లూటూత్, AUX, ఆప్టికల్, USB మరియు HDMI Arc వంటి ఆల్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
Also Read: ఆన్లైన్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కోసం ఎలా అప్లై చేసుకోవాలి.!
ఇది ఈగేట్ అందించిన పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,499 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా ధరతో పోలిస్తే కొంచెం రేటు పెరిగింది. అయినా కూడా ఈ ధరలో ఇది బెస్ట్ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ అవుతుంది.
ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది కూడా క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫార్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కూడా డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది కూడా ఆప్టికల్, USB, బ్లూటూత్, AUX మరియు HDMI Arc సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.