మూగబోయిన Facebook మరియు Whatsapp… ఎందుకంటే..!
Facebook మరియు Whatsapp పనిచెయ్యడం మానేశాయి
మీ ఫేస్ బుక్ అకౌంట్ చెక్ చేసుకోండి
మీ వాట్సాప్ చెక్ చేసుకోండి
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే షోషల్ మీడియా Facebook మరియు చాటింగ్ యాప్ Whatsapp రెండు కూడా ఒక్కసారిగా పనిచెయ్యడం మానేశాయి. భారతీయ కాలమానం ప్రకారం 9 గంటల సమయంలో వినియోగదారులు వారు పంపిస్తున్న మెసేజిలు మరియు చాటింగ్ ఎదుటి వారికీ చేరడం లేదనే విషయాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని రిపోర్ట్ చేశారు. ఇది కేవలం వారి ఒక్కరికే జరిగి ఉండవచ్చని కొందరు భావించారు.
Surveyఅయితే, తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వాట్సాప్ యాజమాన్యం ఈ సంఘటనకు సంభందించి వివరణ ఇచ్చింది. కొంత మంది వినియోగదారుల వాట్సాప్ అకౌంట్ సరిగ్గా పనిచెయ్యడం లేదని దాని గురించి తమ వద్ద సమాచారం వుందని వెల్లడించింది. అలాగే, తాము వినియోగదారులకు కలిగిన ఈ అసౌకర్యాన్ని తొలగించేందుకు కృషిచేస్తున్నామని కూడా తెలిపింది.
We’re aware that some people are experiencing issues with WhatsApp at the moment. We’re working to get things back to normal and will send an update here as soon as possible.
Thanks for your patience!
— WhatsApp (@WhatsApp) October 4, 2021
అంటే, చాలా త్వరగానే Facebook మరియు Whatsapp పైన కలిగిం ఈ ఇబ్బందిని తొలగించే అవకాశం వుంది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే తలెత్తిన సమస్యకాదు. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఎదుర్కొన్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile