ఈ రోజు ఉదయం నుండి పనిచేయని Facebook మరియు Instagram

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 05 Aug 2019
ఈ రోజు ఉదయం నుండి పనిచేయని Facebook మరియు Instagram
ఈ రోజు ఉదయం నుండి పనిచేయని Facebook మరియు Instagram

ఈరోజు ఉదయం నుండి ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు వీడియో, ఆడియో మరియు ఇమేజిలను పంపించడం మరియు  రిసీవ్ చేసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గత నెలలో కూడా 3 వ తేదికి ఇలాంటి సమస్యే తలెత్తింది. ఈ సమస్య అనేక దేశాలతో పాటుగా భారత దేశంలో కూడా వెలుగుచూసింది.

అయితే,  ఈ విధంగా జరగడానికి  కారణాలు ఇంకా తెలియరాలేదు. వినియోగదారులు తమ వీడియో, ఆడియో మరియు ఇమేజిలను పంపించడం మరియు  రిసీవ్ చేసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యని పరిష్కరించాడనికి తగిన పరిష్కరాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 కానీ, ఈ సమస్య పూర్తిగా పరిష్కరించడం జరిగిందా? లేక ఇంకా కొంత సమయంపడుతుందా అనే విషయం  పైన అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే, అధిక శాతం మంది వినియోగదారులు, ఈ రోజు ఉదయం నుండి తమ పోస్ట్ ను పోస్టింగ్ చెయ్యడం మరియు మరిన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.

logo
Raja Pullagura

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status