EPFO Interest Credited in accounts and know how to check online
EPFO Interest Credit: దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నూతన సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 శాతం వార్షిక వడ్డీని అకౌంట్ హోల్డర్స్ PF ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి, శ్రీ అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు. లెక్కల ప్రకారం, సుమారు 34 కోట్ల మంది EPFO ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ ప్రక్రియ జూలై 15 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది సభ్యులు వారి అకౌంట్ లలో వడ్డీ జమ చేయబడినట్లు కనుగొన్నారు. మరికొంత మందికి దశలవారీగా అప్డేట్ అవుతుందని చెబుతున్నారు.
ఈపీఎఫ్ అకౌంట్ లో వడ్డీ జమ చేయబడిందో లేదో మరియు ఎంత వడ్డీ జమ చేయబడిందో ఆన్లైన్ లో చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. దీనికోసం మూడు పద్ధతులు ఉన్నాయి. ఈ మూడు పద్ధతులు వివరంగా తెలుసుకుందాం.
ఇది చాలా క్లియర్ అండ్ డైరెక్ట్ పద్ధతి అవుతుంది. దీనికోసం ఈపీఎఫ్ఓ సైట్ లో పాస్ బుక్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. ఇందులో మీ UAN Number మరియు Password తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ PF Member ID ను ఎంచుకోండి. ఇక్కడ మీకు మీ పాస్ బుక్ కనిపిస్తుంది. ఈ పాస్ బుక్ లో మీ వడ్డీ జమ చేయబడిందో లేదో ఎంట్రీని చూసి తెలుసుకోండి. వడ్డీ జమ అయితే ఎంత మీకు అయ్యిందో కూడా మీకు తెలుస్తుంది.
ప్రభుత్వ సంబంధిత అన్ని అవసరాల కోసం ప్రభుత్వం అందించిన ఉమంగ్ యాప్ ద్వారా కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మొబైల్‌లో UMANG యాప్ ఓపెన్ చేయండి. ఇందులో ఈపీఎఫ్ఓ సర్వీస్ ను ఎంచుకోండి మరియు మీ UAN నెంబర్ తో లాగిన్ అయ్యి OTP నమోదు చేయండి. లాగిన్ అయిన తర్వాత ‘View Passbook’ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ లేటెస్ట్ పీఎఫ్ బ్యాలెన్స్ మరియు వడ్డీ వివరాలు కనిపిస్తాయి.
Also Read: సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా వచ్చిన Realme Narzo 100x 5G ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ రెండు చాలా సింపుల్ పద్ధతి గా ఉంటాయి. దీనికోసం మీరు ఎక్కడ కూడా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ రిజిస్టర్ మొబైల్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నంబర్ కు SMS పంపండి. ఇక్కడ కావాలనుకుంటే మీ భాషను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఎలాగంటే, ENG స్థానంలో TEL, HIN వంటి భాషా కోడ్ లను మీరు ఉపయోగించవచ్చు.
మీ UAN ఆధార్, PAN లేదా బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉంటే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వండి. కొన్ని క్షణాల్లోనే మీ PF బ్యాలెన్స్ SMS రూపంలో వస్తుంది.
ముఖ్య గమనిక: జూలై 15 న అందరి ఖాతాల్లో ఒకేసారి వడ్డీ కనిపించకపోవచ్చు. ఈపీఎఫ్ఓ దశలవారీగా క్రెడిట్ చేస్తుంది.