ఇండియన్ మార్కెట్లో ఆరు కొత్త AC లను లాంచ్ చేసిన Elista: ప్రైస్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Elista

Elista ఈరోజు దేశీయ మార్కెట్లో ఆరు కొత్త AC లను విడుదల చేసింది

డిమాండ్ కు తగిన విధంగా ఈ కొత్త ఏసీ లను తీసుకొచ్చినట్లు తెలిపింది

ఇండియన్ మార్కెట్లో ఆరు కొత్త AC లను లాంచ్ చేసిన Elista: ప్రైస్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Elista ఈరోజు దేశీయ మార్కెట్లో ఆరు కొత్త AC లను విడుదల చేసింది. కంపెనీ యొక్క EL-SAC సిరీస్ నుంచి ఈ ఆరు ఏసీ లను విడుదల చేసింది. ఇందులో 1 టన్ మొదలుకొని 2 టన్ వరకు కెపాసిటీ కలిగిన ఏసీ లను అందించింది. పవర్ సేవింగ్ ఏసీ లపై పెరిగిన డిమాండ్ కు తగిన విధంగా ఈ కొత్త ఏసీ లను తీసుకొచ్చినట్లు తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Elista (EL-SAC) AC: ప్రైస్

ఎలిస్తా EL-SAC సిరీస్ నుంచి ఈరోజు 6 కొత్త ఏసీలు లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి ఏసీ లను సరికొత్త హెల్త్ మ్యాక్స్ టెక్నాలజీతో అందించింది. దీనికోసం 3-ఇన్-వన్ యాంటీవైరస్ HD ఫిల్టర్ సిస్టం ను ఈ లలో అందించింది. ఈ ఆరు ఏసీల మోడల్ నెంబర్ మరియు ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

EL-SAC24-3INVBP (2 Ton) : ధర రూ. 65,900

EL-SAC18-5INVBP5 (1.5 Ton) : ధర రూ. 57,000

EL-SAC18-3INBNC (1.5 Ton) : ధర రూ. 49,990

EL-SAC18-3INVBP48 (1.5 Ton) : ధర రూ. 47,990

EL-SAC18-3FSBNC (1.5 Ton) : ధర రూ. 52,990

EL-SAC12-3INVBPN (1 Ton) : ధర రూ. 44,490

Also Read: భారీ ఆఫర్స్ తో మొదలైన Samsung Galaxy M56 5G స్మార్ట్ ఫోన్ సేల్.!

Elista (EL-SAC) AC : ఫీచర్స్

ఎలిస్తా కొత్త ఏసీ లను స్టార్ మరియు ఫిక్స్డ్ స్పీడ్ ఎంపికతో కూడా అందించింది. ఈ ఏసీలను 100% కాపర్ కాయిల్ తో అందించింది. ఈ ఏసీ లలో విస్తారంగా ఉపయోగించే R-32 రిఫ్రిజిరెంట్ గ్యాస్ కలిగి ఉంటుంది. ఈ ఎలిస్తా కొత్త ఏసీలు చాలా సైలెంట్ గా పని చేస్తాయి మరియు హిడెన్ డిస్ప్లేని కూడా కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.

Elista (EL-SAC) AC

ఎలిస్తా సరికొత్తగా అందించిన ఈ ఏసీల మరిన్ని ఫీచర్స్ చూస్తే, ఈ ఏసీలు యాంటీ రస్ట్ డిజైన్ మరియు ఫైర్ ప్రూఫ్ కాంపోనెంట్స్ కలిగి ఉంటాయట. ఈ ఏసీలు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కూడా కలిగి ఉంటాయి. ఈ ఏసీలు ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు, 45 డిగ్రీల కంటే ఎక్కువగా టెంపరేచర్ ఉండే సయమంలో కూడా ఈ ఏసీ ఎనర్జీ సేవ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఏసీలు అన్ని ప్రధాన షాపుల్లో లభిస్తాయి. ఈ ఏసీల ఎనర్జీ సేవింగ్ డేటాని కంపెనీ ఇంకా అందించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo