DoT కొత్త నిర్ణయంతో నకిలీ SIM కార్డ్ లకు చరమగీతం.!

HIGHLIGHTS

DoT కొత్త నిర్ణయంతో నకిలీ SIM కార్డ్ లకు చరమగీతం పాడనున్న

నకిలీ SIM కార్డ్ లకు చెక్

ఆ విషయాన్ని కస్టమర్ కు ఖచ్చితంగా తెలియచేయాలి

DoT కొత్త నిర్ణయంతో నకిలీ SIM కార్డ్ లకు చరమగీతం.!

DoT కొత్త నిర్ణయంతో నకిలీ SIM కార్డ్ లకు చరమగీతం పాడనున్నది. మార్కెట్లో ప్రబలిన SIM స్వాప్ మోసాన్ని తగ్గించడానికి కొత్త SMS నియమాన్ని డిపార్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) రూపొందించింది. ఈ కొత్త SMS రూల్ ద్వారా నకిలీ SIM బెడదను పూర్తిగా రూపుమాపాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి DoT తీసుకున్న కొత్త SMS రూల్ నిర్ణయం ఏమిటి? దానితో నకిలీ SIM కార్డ్ లకు ఎలా చెక్ పెట్టనున్నదో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

DoT కొత్త SMS రూల్ నిర్ణయం ఏమిటి?

టెలికం ఆపరేటర్ కు సిమ్ అప్గ్రేడ్ లేదా నంబర్ మార్చమని రిక్వెస్ట్ వచ్చిన తర్వాత, ఆ విషయాన్ని కస్టమర్ కు ఖచ్చితంగా తెలియచేయాలి. దీనికోసం, కస్టమర్ IVRS కాల్ ద్వారా ఆ రిక్వెస్ట్ ను నిర్ధారించాలి. తద్వారా, ఈ ప్రక్రియ SIM కార్డ్ యొక్క అధీకృత హోల్డర్ లేదా యజమాని ద్వారా వచ్చినదే అని నిర్ధారణ అవుతుంది. ఇకవేళ ఈ ప్రక్రియలో కస్టమర్ ఆ రిక్వెస్ట్ నిర్ధారించక పోయినట్లయితే లేదా తిరస్కరించినట్లయితే, టెలికాం ఆపరేటర్ వెంటనే SIM అప్‌గ్రేడ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయవలసి ఉంటుంది. ఇతరులు మీ మొబైల్ నంబర్ మరియు OTPకి యాక్సెస్ పొందకుండా నిరోధించడానికి ఈ కొత్త ప్రక్రియ అనుసంధానం చేయబడింది.

DoT ఈ కొత్త రూల్ ఎందుకు తెచ్చింది?

స్కామర్లు మొబైల్ నంబర్స్ యొక్క డూప్లికేట్ SIM కార్డ్ లను రిక్వెస్ట్ ద్వారా పొందడం కోసం టెలికాం బ్రాండ్‌ లను మోసం చేస్తున్నారు. అంటే, యజమాని ఒకరు దాని డూప్లికేట్ SIM కార్డ్ మరొకరి వద్ద ఉంటుంది. ఇంకేముంది, స్కామర్లు ఈ డూప్లికేట్ SIM కార్డ్‌ని పొందినప్పుడు, ఒరిజినల్ SIM కలిగిన వారి ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి లేదా ఇతర మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ సిమ్ కార్డు అనధికార యాక్సెస్‌ గా ఉపయోగిస్తారు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo