మీ జియో ఫోనులో TIK TOK ను ఎలా వాడాలో తెలుసా?

మీ జియో ఫోనులో TIK TOK ను ఎలా వాడాలో తెలుసా?
HIGHLIGHTS

టిక్ టాక్ నుండి వీడియోలను ఎలా చూడవచ్చునో మీకు చెప్పబోతున్నాను.

జియో ఫోన్ గురించి దాదాపుగా అందరికి తెలిశిన విష్యం ఏమిటంటే, వాట్సాప్ మరియు యూట్యూబ్‌లను మాత్రమే వీడుకోవచ్చని. ఎందుకంటే, ఇది ఫీచర్ ఫోన్ కాబట్టి దీని కారణంగా, సంస్థ మీకు యాక్సెస్ ఇచ్చే యాప్స్ మాత్రమే ఈ ఫోనులో అమలు చేయవచ్చు. అంతేకదా, మీరు జియో ఫోనులో టిక్‌టాక్‌ను అమలు చేయలేరు. అయితే, మీరు టిక్ టాక్ వీడియోలను చూడాలనుకుంటే, మీరు ఖచ్చితంగా వాటిని చూడవచ్చు. ఈ వీడియోలను మీరు టిక్ టాక్ నుండి ఎలా చూడవచ్చునో మీకు చెప్పబోతున్నాను.

JioPhone లో TIKTOK ను ఎలా ప్లే చేయాలి

మీరు JIPhone లో TIKTOK ని డౌన్‌లోడ్ చేయలేరు, కానీ మీరు ఖచ్చితంగా దాని వీడియోను చూడగలరు. దీని కోసం, మీరు యూట్యూబ్ యాప్ ని జియో ఫోనులో తెరవాలి, ఆ తర్వాత మీరు టిక్‌ టాక్ ఇండియాను సెర్చ్ బార్‌లో, అంటే యూట్యూబ్‌లోని సెర్చ్ బార్‌లో వ్రాయవలసి ఉంటుంది మరియు మీరు సెర్చ్  వెంటనే, టిక్‌టాక్‌లో అత్యంత ప్రాచుర్యం వున్న వీడియోలను చూడవచ్చు. . చాలా ఎక్కువ వీడియోలు మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న వీడియోలను మీరు సద్వినియోగం చేసుకోవాలి.

ఇది కాకుండా, JioPhone యొక్క వినియోగదారులు గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ మరియు ఫేస్బుక్ వంటి కొన్ని ఇతర యాప్స్ కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా. కైయోస్‌లో వాట్సాప్‌కు మద్దతిచ్చే ఫీచర్ ఫోన్లు,  జియోఫోన్ మరియు జియోఫోన్ 2 మాత్రమే అని మీకు గుర్తు చేసుకోండి.

ఇప్పుడు మీరు జియోఫోన్‌లో వాట్సాప్‌ను ఎలా ఇన్‌స్టాల్ మరియు ఎల్ డౌన్‌ లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీని కోసం, మీకు కొన్ని సులభమైన దశలను చెప్పబోతున్నాను. వాటిని ఉపయోగించడం ద్వారా, మీరు మీ జియోఫోన్‌లో వాట్సాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు దాన్ని కూడా ఉపయోగించవచ్చు.

మీ JioPhone లో ఇలా WhatsApp ని డౌన్‌లోడ్ చేసుకోండి

1. దీని కోసం, మొదట మీరు మీ ఫోన్ను అప్‌డేట్ చేయాలి.

2. దీని తరువాత, మీ జియోఫోన్‌లో జియో App స్టోర్ తెరవండి.

3. సెర్చ్ బాక్స్‌కు వెళ్లి వాట్సాప్ కోసం సెర్చ్ చేయండి.

4. ఇప్పుడు వాట్సాప్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మిగిలిన ప్రక్రియ పూర్తయినప్పుడు దాన్ని తెరవండి.

5. ఇప్పుడు మీ రిలయన్స్ జియో నంబర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాను సెటప్ చేయండి.

6. ఇప్పుడు మీరు ఈ నంబర్ కు ఒక OTP ను అందుకుంటారు, దానిని ఇక్కడ నమోదు చేయండి.

7. ఇప్పుడు మీరు మీ జియోఫోన్‌లో వాట్సాప్‌ను చాలా తేలికగా ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo