మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించారో మీకు తెలుసా..!!

HIGHLIGHTS

ప్రతి అవసరానికి ముఖ్యంగా ఉపయోగించే ఏకైక మరియు ప్రధాన పత్రం ఆధార్ కార్డు

మీ ఆధార్ కార్డును మీరు ఎక్కడెక్కడ వాడబడిందో తెలుసుకోవడం చాలా సులభం

మీరు అనుసరించవలసిన విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడవచ్చు

మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించారో మీకు తెలుసా..!!

భారతదేశంలో ప్రతి అవసరానికి ముఖ్యంగా ఉపయోగించే ఏకైక మరియు ప్రధాన పత్రం ఆధార్ కార్డు. అయితే, ప్రతి అవసరానికి ఆధార్ కార్డును ఉపయోగించడం మూలంగా ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగించమనే విషయం మనకు గుర్తుండక పోవచ్చు. కానీ, మీ ఆధార్ కార్డును మీరు ఎక్కడెక్కడ వాడబడిందో తెలుసుకోవడం చాలా సులభం. మీ ఆధార్ కార్డ్ ఎక్కడ, ఎందుకు ఉపయోగించారు అనేవిషయాన్ని తెలుసుకోవడానికి మీరు అనుసరించవలసిన విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ క్రింది విధంగా చేయాలి

1.  ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క https://resident.uidai.gov.in లింక్ ఓపెన్ చేయాలి.

2. ఇక్కడ మీరు పైన సూచించిన ఎంపికల్ల్లో My Aadhaar లోకి వెళ్ళాలి

3. ఇక్కడ మీరు Aadhaar Services లోకివెళ్ళి అందులో  Aadhaar Authentication History ని ఎంచుకోవాలి

4.  పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.

5. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.

6. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.

7. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.

8. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడబడిందో తెలుస్తుంది.

9. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo