ఈ యాప్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి..!

HIGHLIGHTS

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ఈ యాప్స్ తో మీ డేటా చౌర్యానికి గురయ్యే అవకాశం

ఈ నాలుగు యాప్స్ లను కొత్త బ్యాచ్ గా Malwarebytes ల్యాబ్ గుర్తించింది

ఈ యాప్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి..!

గత నెల ప్రారంభంలో, గూగుల్ ప్లే స్టోర్‌లో జాబితా చేయబడిన 400 హానికరమైన యాప్‌లు యూజర్ లాగిన్ సమాచారం మరియు వివరాలను దొంగిలించాయని, ఫేస్ బుక్ తన యూజర్లను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన నెల తరువాత, Malwarebytes ల్యాబ్ హిడెన్ యాడ్స్ ట్రోజన్ సోకిన ఒక నాలుగు యాప్‌ లను హైలైట్ చేసింది. అంటే, ఈ నాలుగు యాప్స్ ద్వారా మీ డేటా చౌర్యానికి గురయ్యే అవకాశం ఉందని ఈ ల్యాబ్ చెబుతోంది. Google Play Store లో వ్యక్తిగత లేదా ఒక గ్రూప్ యాప్‌లు హానికరమైనవిగా గుర్తించబడటం మనం తరచుగా చూస్తాము. ఇప్పుడు ఇదే తరగలో ఈ నాలుగు యాప్స్ లను కొత్త బ్యాచ్ గా Malwarebytes ల్యాబ్ గుర్తించింది. ఈ యాప్ లను క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

1. Bluetooth Auto Connect

2. Bluetooth App Sender

3. Driver: Bluetooth, Wi-Fi, USB

4. Mobile transfer: smart switch

Malwarebytes ప్రకారం, ఈ యాప్‌ లను డౌన్‌లోడ్ చేసిన 72 గంటలలోపు ఎలాంటి హానికరమైన ప్రవర్తనను చూపించలేదు. అయితే, ఆ తరువాతే ఈ యాప్‌లు Chrome లో ఫిషింగ్ సైట్‌లను తెరుస్తాయి. ఇక్కడ వినియోగదారులు ప్రకటనలపై క్లిక్ చేస్తే దాని ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. వీటిలో కొన్ని యాడ్స్ లేదా సైట్స్ అంత ప్రమాదకరమైనవి కాకపోయినా, కొన్ని ఇతర సైట్‌లు మాత్రం ప్రమాదకరమైనవి. ఇవి కొత్త అప్డేట్ కోసం క్లిక్ చేయండి, అంటూ యూజర్లను మోసగించడానికి ప్రయత్నిస్తుంది.

మాల్వేర్‌బైట్స్ ల్యాబ్స్ విశ్లేషకుడు నాథన్ కొల్లియర్, ఈ డెవలపర్ గతంలో Google Play లో మాల్వేర్‌ను వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రసిద్ధ బ్లూటూత్ ఆటో కనెక్ట్ యాప్ యొక్క కొన్ని వెర్షన్లు మాత్రం గతంలో క్లీన్ గా ఉన్నాయని కూడా పేర్కొన్నాడు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo