ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!
HIGHLIGHTS

ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

గూగుల్ తన ప్లే స్టోర్ నుండి ఈ యాప్స్ ను తొలిగించింది

వీటిలో కొన్ని యాప్స్ ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి

ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే, ఒక 5 యాప్స్ మాల్వేర్ బారిన పడినట్లు గుర్తించిన గూగుల్ తన ప్లే స్టోర్ నుండి ఈ యాప్స్ ను తొలిగించింది. వాస్తవానికి, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన మరియు సాధారణ సమస్య వైరస్ ఎటాక్. ఈ సమస్య ఎక్కవగా అనర్ధమైన యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఉండవచ్చు.

తర్డ్ పార్టీ యాప్స్ తో ఈ సమస్య సర్వసాధారణమే అయినా అప్పుడప్పుడు ప్లే స్టోర్ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. అయితే, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా యాప్ వైరస్ భారిన పడినట్లు గుర్తిస్తే వెంటనే వాటిని ప్లే స్టోర్ నుండి వెంటనే తొలగిస్తుంది.

ఇటీవల కూడా గూగుల్ కొన్ని ప్రముఖ యాప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఈ యాప్స్ యూజర్ల సున్నితమైన డేటాని సేకరించే మాల్వేర్ ను కలిగి ఉన్నట్లుగా గుర్తించిన కారణంగా ఈ యాప్స్ ను తొలిగించింది. వీటిలో కొన్ని యాప్స్ ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి. మీరు ఆకానుక మీ ఫోన్ లో ఈ యాప్స్ లో ఏదైనా యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే మీ ఫోన్ నుండి డిలీట్ చేయండి. ఈ క్రింద ఆ యాప్స్ లిస్ట్ చూడవచ్చు.

Apps List

PIP Pic Camera Photo Editor

Wild & Exotic Animal Wallpaper

Zodi Horoscope – Fortune Finder

PIP Camera 2022

Magnifier Flashlight

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo