కేవలం రూ.7,990 ప్రారంభ ధరతో కొత్త వాషింగ్ మెషీన్స్ లాంచ్ చేసిన Daiwa
Daiwa రెండు కొత్త శ్రేణి సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషీన్స్ విడుదల చేసింది
టఫ్ఎండ్ గ్లాస్ మరియు రష్ట్-ప్రూఫ్ బాడీ
ధర మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లి గా ఉంచింది
భారతదేశంలో Daiwa రెండు కొత్త శ్రేణి సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషీన్స్ విడుదల చేసింది. ఈ వాషింగ్ మెషీన్స్ ను 7Kg నుండి మొదలుకొని 8Kg వరకు అందించింది. అయితే, ఈ వాషింగ్ మెషీన్ లను టఫ్ఎండ్ గ్లాస్ మరియు రష్ట్-ప్రూఫ్ బాడీ వంటి మంచి ఉపయోగకరమైన ఫీచర్లతో తీసుకువచ్చింది. ఇన్ని ఫీచర్లను కలిగి ఉన్నా కూడా ఈ సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషీన్ ల ధర మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లి గా ఉంచింది. ఈ వాషింగ్ మెషీన్స్ కేవలం రూ.7,990 ప్రారంభ నుండి మొదలవుతాయి.
SurveyDaiwa కొత్త ప్రకటించిన ఈ సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషీన్స్ కూడా ప్రోడక్ట్ పైన 2 సంవత్సరాల వారంటీని, వాష్ మోటార్ పైన 5 సంవత్సరాల వారంటీని కలిగివుంటాయి. ఈ కొత్త శ్రేణిలో నాలుగు కెపాసిటీలలో వాషింగ్ మెషీన్స్ తీసుకొచ్చింది. అన్ని వాషింగ్ మెషీన్లు కూడా భారతీయ పవర్(కరెంట్) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక-నాణ్యత ఇవ్వగల ముడి పదార్దాలతో రూపొందించబడ్డాయని, కంపెనీ తెలిపింది.
ఈ కొత్త శ్రేణి సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషీన్స్ 1300RPM కంటే ఎక్కువ శక్తితో వస్తాయి. అంతేకాదు, మీడియం మరియు పెద్ద ఫ్యామిలీ లకు కూడా సరిపడేలా పెద్ద టబ్ తో ఉంటాయి. ఇంటెలిజెంట్ వాష్ ప్రోగ్రామ్‌లతో పాటుగా సోక్(నానబెట్టే) టైమర్ ఫీచర్ మరియు బజర్‌తో ఈ వాషింగ్ మెషీన్స్ జతచేయబడ్డాయి. దీని ఫలితంగా సున్నితమైన వాష్ సైకిల్‌తో పాటు మెల్లగా గ్లైడింగ్ కూడా అవుతుందని, Daiwa తన లేటెస్ట్ సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషీన్స్ వివరించింది.
ఈ వాషింగ్ మెషీన్స్ అన్నిప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile