18 ఏళ్ళు నిండిన వారందరికీ వాక్సిన్!! ఎల్లుండి నుండి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్!

18 ఏళ్ళు నిండిన వారందరికీ వాక్సిన్!! ఎల్లుండి నుండి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్!
HIGHLIGHTS

సెకండ్ వేవ్ లో వేగంగా విస్తరిస్తున్న కరోనా

18 సంవత్సరాలు నిండిన అందరికి కరోనా వ్యాక్సిన్

ఈ కార్యక్రమం మే 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు, 18 సంవత్సరాలు నిండిన అందరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ లో వేగంగా విస్తరిస్తున్న కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ను త్వరగా అందించే ఉద్యేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జాతీయ కోవిడ్-19 వ్యాక్సినేషన్ 3 దశలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన వారికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం మే 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఏప్రిల్ 28 నుండి అంటే ఎల్లుండి నుండి ఈ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. Covid-19 వ్యాక్సిన్ కోసం ఎలా రిజిష్టర్ చెయ్యాలో క్రింద చూడవచ్చు.      

Covid-19 వ్యాక్సిన్ కోసం ఎలా రిజిష్టర్ చెయ్యాలి

https://www.cowin.gov.in/home లేదా ఆరోగ్యసేతు యాప్ నుండి రిజిష్టర్ చెయ్యాలి

CoWIN పోర్టల్ హోమ్ పేజిలోకి వెళ్లాలి

ఇక్కడ కుడి వైపున పైన Register Your Self పైన నొక్కండి

ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP తో లాగిన్ అవ్వడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు.

ఎటువంటి డాక్యుమెట్స్ అవసరం

మన ఐడెంటిటీని నిర్ధారించే ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటి కార్డు, PAN కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మరియు పెన్షన్ కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకదానిని రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo