ఇక అందరికీ కరోనా వ్యాక్సిన్!! ఎలా అప్లై చెయ్యాలో తెలుసా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Apr 2021
HIGHLIGHTS
  • 18 సంవత్సరాలు పైబడిన అందరికి కరోనా వ్యాక్సిన్

  • జాతీయ కోవిడ్-19 వ్యాక్సినేషన్ 3 దశ

  • మే 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

ఇక అందరికీ కరోనా వ్యాక్సిన్!! ఎలా అప్లై చెయ్యాలో తెలుసా?
ఇక అందరికీ కరోనా వ్యాక్సిన్!! ఎలా అప్లై చెయ్యాలో తెలుసా?

నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన అందరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ నుండి ప్రజలను కాపాడే ఉద్యేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ కోవిడ్-19 వ్యాక్సినేషన్ 3 దశలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన వారికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం మే 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

Covid-19 వ్యాక్సిన్ కోసం ఎలా రిజిష్టర్ చెయ్యాలి

https://www.cowin.gov.in/home లేదా ఆరోగ్యసేతు యాప్ నుండి రిజిష్టర్ చెయ్యాలి

CoWIN పోర్టల్ హోమ్ పేజిలోకి వెళ్లాలి

ఇక్కడ కుడి వైపున పైన Register Your Self పైన నొక్కండి

ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP తో లాగిన్ అవ్వడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు.

ఎటువంటి డాక్యుమెట్స్ అవసరం

మన ఐడెంటిటీని నిర్ధారించే ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటి కార్డు, PAN కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మరియు పెన్షన్ కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకదానిని రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించవచ్చు.

logo
Raja Pullagura

email

Web Title: covid 19 vaccine for all announced by center and here is how to apply for vaccine online
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status