NEET Re Exam కోసం Telegram పై తాత్కాలిక నిషేధం విధించిన కేంద్రం.!

HIGHLIGHTS

ఇటీవల నీట్ ఎగ్జామ్ లో జరిగిన అనిశ్చితి కారణంగా ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది

దేశవ్యాప్తంగా జరుగనున్న NEET-UG రీ ఎగ్జామ్ పారదర్శకతను కాపాడేందుకు భారత ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది

NEET Re Exam నేపథ్యంలో ప్రభుత్వం టెలిగ్రామ్‌ పై తాత్కాలిక పరిమితులు విధించడం అనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది

ఇటీవల నీట్ ఎగ్జామ్ లో జరిగిన అనిశ్చితి కారణంగా ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరుగనున్న NEET-UG రీ ఎగ్జామ్ కారణంగా, పరీక్ష భద్రత మరియు పారదర్శకతను కాపాడేందుకు భారత ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనది టెలిగ్రామ్ (Telegram) మెసేజింగ్ యాప్‌ పై వేసిన తాత్కాలిక పరిమితి వేటు. NEET Re Exam నేపథ్యంలో భారత ప్రభుత్వం టెలిగ్రామ్‌ పై తాత్కాలిక పరిమితులు విధించడం అనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

NEET Re Exam కోసం Telegram పై తాత్కాలిక నిషేధం ఎందుకు?

ప్రభుత్వ మరియు కొన్ని మీడియా నివేదికల ప్రకారం, పరీక్షల సమయంలో జరిగే ప్రశ్నపత్రం లీక్స్, ఫేక్ మెసేజ్‌ విస్తరణ మరియు మోసపూరిత సమాచారం వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా పరీక్షకు సంబంధించి తప్పుదారి పట్టించే సమాచారం వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది విద్యార్థుల మనోబలాన్ని దెబ్బతీసే చర్యగా ఉంటుంది.

ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సంబంధిత అధికారులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT Act) సెక్షన్ 69A కింద చర్యలు తీసుకుని, కొన్ని ప్రాంతాల్లో లేదా నిర్దిష్ట కాలానికి టెలిగ్రామ్ సర్వీస్ ను పరిమితం చేసినట్లు చాలా నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్య ప్రధానంగా పరీక్షా వ్యవస్థ పై నమ్మకాన్ని కాపాడేందుకు తీసుకున్న ముఖ్యమైన చర్యగా విద్యావేత్తలు చెబుతున్నారు.

అలాగే, కొన్ని వార్తా కథనాల ప్రకారం, టెలిగ్రామ్‌ లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ ను దుర్వినియోగం చేసి పాత పోస్టులను కొత్తవిగా మార్చి లీక్‌లుగా చూపించే ప్రయత్నాలు జరిగినట్లు కూడా టెలిగ్రామ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల విద్యార్థులలో గందరగోళం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావించినట్లు కూడా చెబుతున్నారు.

Also Read: Redmi Turbo 5: జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ అండ్ బిగ్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!

నిషేధం లేదా పరిమితి ఎప్పటి వరకు కొనసాగుతుంది?

రిపోర్ట్స్ ప్రకారం, ఈ పరిమితి తాత్కాలికమే అని సమాచారం. NEET రీ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు మాత్రమే ఈ చర్య కొనసాగవచ్చని భావిస్తున్నారు. విద్యార్థులకు న్యాయమైన మరియు పారదర్శక పరీక్షా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ కొత్త చర్యలు తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.

టెలిగ్రామ్‌ పై తీసుకున్న ఈ నిర్ణయం పరీక్షా భద్రత కాపాడేందుకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యగా మనం చూడవచ్చు. అయితే, విద్యార్థులు మరియు వినియోగదారులు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని కూడా చాలా మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కూడా చేబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :