Tecno Pova 3: ఈరోజు నుండి మొదలైన బడ్జెట్ 7000 mAh ఫోన్ సేల్..!!

Tecno Pova 3: ఈరోజు నుండి మొదలైన బడ్జెట్ 7000 mAh ఫోన్ సేల్..!!
HIGHLIGHTS

Tecno Pova 3 సెల్ ఈరోజు నుండి మొదలయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ అతిపెద్ద 7000 mAh బ్యాటరీని కలిగివుంది

డిజైన్, కెమెరా మరియు ప్రాసెసర్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది

టెక్నో ఇటీవల ఇండియాలో ప్రకటించిన Tecno Pova 3 సెల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,499 రూపాయల ధరలోనే అతిపెద్ద 7000 mAh పెద్ద బ్యాటరీని కలిగివుంది. కేవలం ఇదొక్క ప్రత్యేకత మాత్రమే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, కెమెరా మరియు ప్రాసెసర్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు.        

Tecno Pova 3:

ముందుగా టెక్నో పోవా 3 ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చెయ్యబడింది. ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. అలాగే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. జూన్ 27 నుండి అంటే ఈరోజు నుండి అమెజాన్ ద్వారా సేల్ అవుతోంది. ఈ ఫోన్ పైన ప్రధాన బ్యాంక్ లు తమ క్రెడిట్ కార్డ్ ఆఫర్లను కూడా అందించాయి.  

Tecno Pova 3: స్పెక్స్

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు కంపెనీ ప్రకటించింది. టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 14 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కూడా టెక్నో పేర్కొంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాకి జతగా మరొక రెండు కెమరాలు ఉంటాయి మరియు క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo