BSNL బంపర్ అఫర్ రేపటితో ముగుస్తుంది

HIGHLIGHTS

BSNL ఇటీవల ప్రకటించిన బంపర్ అఫర్ రేపటితో ముగుస్తుంది

కస్టమర్లకు 5GB డేటాను ఉచితంగా అఫర్ చేస్తున్నట్లు BSNL ప్రకటించింది

ఈ ఆఫర్ జనవరి 15, 2022 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది

BSNL బంపర్ అఫర్ రేపటితో ముగుస్తుంది

ప్రభుత్వ యాజమాన్య టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇటీవల ప్రకటించిన బంపర్ అఫర్ రేపటితో ముగుస్తుంది. BSNL నెట్వర్క్ కు కొత్తగా మారుతున్నా లేదా మరిన కస్టమర్లకు 5GB డేటాను ఉచితంగా అఫర్ చేస్తున్నట్లు BSNL ప్రకటించింది. ఈ ఉచిత 5GB డేటా 30 రోజుల వ్యాలిడిటీ లేదా ప్రస్తుతం ప్లాన్ వ్యాలిడిటీ  వరకూ మాత్రమే చెల్లుతుంది. BSNL SIM కి మారిన కొత్త వినియోగదారుల కోసం మాత్రమే ప్రకటించిన ఈ 5GB ఉచిత డేటా అఫర్ రేపటితో ముగుస్తుంది. అంటే, ఈ ఆఫర్ జనవరి 15, 2022 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బిఎస్ఎన్ఎల్  '#switchtoBSNL' పేరుతో కొత్త ప్రమోషన్‌ను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ 5GB ఉచిత డేటాని అఫర్ చేస్తోంది. అయితే, ఈ #SwitchtoBSNL ప్రమోషన్‌ అఫర్ కోసం కొన్ని నిబంధనలు మరియు షరతులు కూడా పెట్టింది. దీనికోసం వినియోగదారులు తమ టైమ్‌లైన్‌లో ఎందుకు BSNL నెట్ వర్క్ కు మరలనుకుంటున్నారో వివరించి షేర్ చేయాలి మరియు ఆ స్క్రీన్ షాట్ ను BSNL కి షేర్ చేయ్యాల్సివుంటుంది. BSNLలో చేరే కొత్త కస్టమర్‌లు ట్వీట్/పోస్ట్ యొక్క స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి, సంబంధిత మొబైల్ నంబర్‌లో DM/Whatsapp (9457086024) ద్వారా కంపెనీకి పంపాలి.

ఇవన్నీ చేసిన తర్వాత, కస్టమర్లు కంపెనీ నుండి 5GB బోనస్ డేటాను పొందడానికి అర్హులవుతారు. ఈ ఆఫర్ జనవరి 15, 2022 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని గుర్తుంచుకోండి. ఈ ప్రయోజనాలను పొందడానికి వినియోగదారులు వారి ప్రస్తుత ఆపరేటర్ నుండి వారి మొబైల్ నంబర్‌ను BSNLకి పోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo