పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధర.!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధర.!
HIGHLIGHTS

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

భారీగా పడిపోయిన బంగారం ధ

బంగారం ధర గడిచిన రెండు రోజుల్లో భారీగా పడిపోయింది

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా పడిపోయిన బంగారం ధర. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధర గడిచిన రెండు రోజుల్లో భారీగా పడిపోయింది. కేవలం గడిచిన రెండు రోజుల్లోనే గోల్డ్ మార్కెట్ తులానికి 1,300 రూపాయలకు పైగా పతనాన్ని చూసింది. అంతేకాదు, దాదాపుగా 60 వేల రూపాయల మార్క్ ను టచ్ చేసే దశలో బంగారం మళ్ళి తిరిగి క్రిందకు చేసుకుంది. మరి గడిచిన రెండు రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. 

Gold Price Live:

గత గురువారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,600 రూపాయలుగా ఉండగా, శుక్రవారం మరియు శనివారం గోల్డ్ మార్కెట్ 1200 రూపాయల నష్టాన్ని చవిచూసి రూ.52,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,470 నుండి 1310 రూపాయలు క్రిందకు దిగి రూ.57,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో గోల్డ్ రేట్ దారుణంగా పడిపోయింది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,310 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo