Gmail పాస్ వర్డ్ మరచిపోయారా.. ఇలా ట్రై చేయండి..!!

Gmail పాస్ వర్డ్ మరచిపోయారా.. ఇలా ట్రై చేయండి..!!
HIGHLIGHTS

మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఎలా

Gmail చాలా మంది జీవితాల్లో భాగంగా మారిపోయింది

Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది

Gmail పాస్ వర్డ్ మరచిపోయారా? అయితే, ఇలా ట్రై చేయండి మీ Gmail పాస్వర్డ్ ను రికవరీ చెయవచ్చు. వాస్తవానికి, Gmail చాలా మంది జీవితాల్లో భాగంగా మారిపోయింది. యూజర్లు Google యొక్క సర్వీస్ లను ఉపయోగించలనుకుంటే Gmail ఖాతా అవసరం అవుతుంది. క్లియర్ గా చెప్పాలంటే, Android ఫోన్‌ వాడేవారికి, ఈ ఖాతా తప్పనిసరి.ఇంత ముఖ్యమైనది కాబట్టే Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. ఒకవేళ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే, ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చాలా సులభంగా తిరిగి పొందగలుగుతారు.

మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఎలా ?

Step 1 – మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.

Step 2 – ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.

Step 3 – మీకు గుర్తుంకువున్న చివరి పాస్‌ వర్డ్ ‌ను నమోదు చేయండి. మీకు పాస్ ‌వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.

Step 4 – మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ‌కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

Step 5 – మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ ‌కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.

Step 6 – ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.

Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.

Step 8 – మీ పాస్వర్డ్ రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ ‌వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo