మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్ లు వాడుతున్నారో తెలుసా..!!

మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్ లు వాడుతున్నారో తెలుసా..!!
HIGHLIGHTS

ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లు ఏవో మీకు తెలుసా

సులభంగా పొందే మార్గాన్నిగురించి ఇక్కడ చూడవచ్చు

మీరు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను పూర్తిగా తెల్సుకోవచ్చు

ఇప్పటి వరకు మీరు చాలా సిమ్ కార్డ్స్ ఉపయోగించి ఉండవచ్చు. అయితే, ఆ నంబర్లు మరియు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లు ఏవో మీకు తెలుసా? ఒకవేళ మీ సమాధానం కనుక కాదు అయితే, ఈ వివరాలను సులభంగా పొందే మార్గాన్నిగురించి ఇక్కడ చూడవచ్చు. వాస్తవానికి, గతంలో ఎవరి పేరుమీద ఎన్ని SIM కార్డ్స్ ఉన్నాయి, వాటిలో యాక్టివ్ మొబైల్ నంబర్లు ఎన్ని అని తెలుసుకోవాలంటే చాలా కష్టం. కానీ, లేటెస్ట్ గా DoT అందించిన కొత్త ఆన్లైన్ సైట్ ద్వారా మీ పేరు మీద మీరు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను పూర్తిగా తెల్సుకోవచ్చు. 

మీ ఆధార్ కార్డు పైన ఎన్ని మొబైల్ నంబర్లను తీసుకున్నారో, అందులో ఎన్ని నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఒక కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ & కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో ఈ వెబ్సైట్ ను తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్ పైన తీసుకున్న అన్ని SIM కార్డ్ ల వివరాలను మరియు యాక్టివ్ నంబర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు.

మీ ఆధార్ నంబర్ పైన ఉన్న SIM కార్డ్ వివరాలను పొందడానికి ఈ క్రింది ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.

మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo