మొబైల్ వాడేవారు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు..!!

Updated on 26-Dec-2022
HIGHLIGHTS

ప్రతి విషయానికి మొబైల్ ఫోన్ పైన ఆధార పడుతున్నారు

ఈ విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయి

మొబైల్ ను అతిగా ఉపయోగిస్తే మీకు కొన్ని ఇబ్బదులు తలెత్తుతాయి

ప్రస్తుత నవీన యుగంలో ఆన్లైన్ గేమింగ్, OTT లో ఎంటర్టైన్మెంట్ మొదలుకోని ప్రతి విషయానికి మొబైల్ ఫోన్ పైన ఆధారపడుతున్నారు. అయితే, కొన్ని మొబైల్స్  రేడియేషన్ ప్రభావాన్ని వెదచల్లుతునట్లు కొన్నినివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ 5 విషయాలు గుర్తుంచుకుంటే లేదా సరైన పద్దతిలో ఫోన్ను వాడినట్లయితే దీన్నీచాలా వరకు తగ్గించవచ్చని మాత్రం చెప్పవచ్చు. ఈ క్రింద ఇచ్చిన 5 మార్గాలను పాటించడం ద్వారా కొంత వరకు ఫోన్ వెదచల్లే రేడియేషన్ భారి నుండి రక్షించవచ్చు.

1.  ఆల్టర్ నేటివ్

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతున్నాము కాబట్టి, వీలైనంత వరకు కాలింగ్ కి బదులుగా టెక్స్ట్ మెసేజిలు పంపడం, లేదా సెల్ ఫోన్ నుండి కాల్స్ చేయాల్సివచ్చినపుడు బ్లూటూత్ హెడ్ సెట్ లేదా, ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుండి తప్పిచుకోవచ్చు. ఎలాగంటే, ఫోన్ మాట్లాడేటప్పుడు మన మెదడుకు ద్గగరగా ఫోనులో వుండే యాంటెన్నాఉంటుంది కాబట్టి అది నేరుగా మన మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పైన తెలిపిన ప్రత్యామ్నాయాల వలన ఫోన్ మన తలకు దూరంగా ఉంటుంది కాబట్టి చాల వరకు రేడియేషన్ తప్పించుకోవచ్చు.

2. అనవసర వాడకం

అనవసర ఫోన్ వాడకాన్ని తగ్గిచుకోవడం : "అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది" అనే సామెత ఇక్కడ కచ్చితంగా నిజమవుతుంది. అతిగా ఫోన్ వాడకం, మీకు ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కేవలం, రేడియేషన్ ప్రమాదమే కాకుండా వత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుందని U.S కి చెందిన, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 వ సంవత్సరంలోనే దీని గురించి తెలిపింది. కాబట్టి, మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

3. రాత్రి సమయం

రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఫోన్లను ఒక అలారం గడియారంలా వాడుతున్నారు. ఇది చాల చిన్న  విషయం కదా, అనుకుంటున్నారా ? కాదు, మీరు అలారం పెట్టి ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు , అప్పుడు అత్యధికమైన రేడియేషన్ మీరు అందుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్న సరే దానిలోని యాంటెన్నా మరియు బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.

4. ఫోన్ సిగ్నల్

సిగ్నల్ సరిగ్గా లేనపుడు ఫోన్ వాడకం తగ్గించాలి : ఫోన్ లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే, సిగ్నల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేస్తుంది కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తవహించండి.

5. 24 గంటలు ఫోన్ వద్దు

మీతో మీ ఫోన్ను అంటిపెట్టుకుని ఉండటాన్ని తగ్గించండి: ఫోన్ను జేబులో లేదా పౌచ్ తో పాటుగా ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పీటుకోవడం ద్వారా మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి , మీఫోనుతో పనిలేనప్పుడు  మీ నుండి కొంత దూరంలో ఉండేలా చూసుకోండి.

పైన చెప్పిన విధంగా చేయడంవలన, రేడియేషన్ను పూర్తిగా నివారించక పోయినా కూడా చాల వరకు తగ్గించవచ్చు. ఎంత దూరంలో ఉన్నా సరే, మన వారికీ మనం ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేలా చేసే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఆనందించవచ్చు. కానీ, అతిగా వాడడం వలన కలిగే ముప్పుకు మనమే కారణం అవుతాము

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :