Holi 2025: అసలే రంగుల పండుగ మరి ఫోన్ నీటిలో పడితే.. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోండి.!
పండుగలో అనుకోకుండా ఫోన్ పై నీళ్లు పడినా లేక ఫోన్ నీళ్ళల్లో జారిపడినా ఇక అంతే సంగతులు
ఈ పండుగకు పైన రంగులు లేదా నీళ్లు వేస్తారని తెలిసినా చాలా మంది ఫోన్ లను మాత్రం వెంటే ఉంచుకుంటారు
మొబైల్ ఫోన్ ను ఎలా కాపాడుకోవాలో ఒకవేళ నీటిలో పడితే ఏమి చెయ్యాలో కూడా ఈరోజు తెలుసుకుందాం
Holi 2025: హోలీ అంటేనే రంగులు చల్లుకుంటూ అందంగా జరుపుకునే పండుగ. మరి ఈ పండుగలో అనుకోకుండా ఫోన్ పై నీళ్లు పడినా లేక ఫోన్ నీళ్ళల్లో జారిపడినా ఇక అంతే సంగతులు. ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. జీవితంలో జరిగే ప్రతి సంతోషాన్ని ఫోన్ లో బంధించి దాచుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అందుకే, ఈ పండుగకు పైన రంగులు లేదా నీళ్లు వేస్తారని తెలిసినా చాలా మంది ఫోన్ లను మాత్రం వెంటే ఉంచుకుంటారు. అందుకే, నీళ్ల నుంచి మొబైల్ ఫోన్ ను ఎలా కాపాడుకోవాలో ఒకవేళ నీటిలో పడితే ఏమి చెయ్యాలో కూడా ఈరోజు తెలుసుకుందాం.
SurveyHoli 2025: ఫోన్ ను ఎలా కాపాడుకోవాలి?
వాస్తవానికి, ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లు కూడా స్ప్లాష్ లేదా వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తున్నాయి. ఈ ఫోన్స్ పై నీరు పడినా పెద్దగా చింతించాల్సిన పని లేదు. కానీ, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.

అందుకే, హోలీ రోజు రంగుల ఆటలు ఆడే సమయంలో ఫోన్ ను నీటి నుంచి రక్షించడానికి అనువైన మొబైల్ ఫోన్ కవర్ లో ఫోన్ ను జాగ్రత్త పరుచుకోవడం అన్నింటికన్నా ఉత్తమం. ఒకవేళ అనుకోకుండా ఆటలో మునిగిపోతే శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ లో ఫోన్ ను భద్రపచుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ మొబైల్ ఫోన్ సేఫ్టీ కోసమే సుమా.
అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే ఏమి చేయాలి?
ఒకవేళ అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే ఏమి చేయాలి? అని మీకు డౌట్ రావచ్చు. దీనికోసం కూడా మంచి టిప్స్ ఉన్నాయి. ఒకవేళ అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే వెంటనే ఫోన్ ను నీటిలో నుండి బయటకు తీసి వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. చెక్ చేయాలి లేదా మరొక సారి చూద్దాం అంటూ ఫోన్ ఆన్ మాత్రం చేయకండి. ఫోన్ పై ఐదైనా కవర్ వంటివి ఉంటే వెంటనే తొలగించాలి.
తర్వాత ఫోన్ యొక్క ఇన్ పుట్స్ SIM కార్డ్, మైక్రో SD కార్డ్ వంటివి తొలగించాలి. నెక్స్ట్ ఫోన్ ను డ్రై చేయడానికి గాలి తగిలేట్టు నీడలో ఆరబెట్టాలి. ఫోన్ ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్ వంటివి వాడకూడదు. ఎందుకంటే, అధిక వేడిమి దెబ్బకి ఫోన్ బ్యాటరీ మరియు లోపలి సున్నితమైన పార్ట్ లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఫోన్ ను ఆరబెట్టడానికి సిలికా జెల్ అన్నింటి కన్నా సరైన పద్దతి. ఫోన్ ఒక సీల్ కవర్ లోకి తీసుకొని అందులో సిలికా జెల్ బ్యాగులు ఉంచి సీల్ క్లోజ్ చేయాలి. సిలికా జెల్ చాలా త్వరగా తడిని ఆకర్షిస్తుంది మరియు ఫోన్ ను పొడిగా మారుస్తుంది. మీరు అనుకోవచ్చు బియ్యం లో ఫోన్ ను పెట్టడం గురించి చెప్పడం లేదని. అవును, వాస్తవానికి బియ్యంలో ఫోన్ ను ఉంచడం వలన ఫోన్ త్వరగా డ్రై అవ్వదు. దీనికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే, బియ్యంలో ఉండే డస్ట్ కారణంగా ఫోన్ పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
Also Read: Holi 2025: హోలీ పండుగ కోసం మీ ప్రియమైన వారికి బెస్ట్ విషెస్ ఇలా తెలపండి.!
అన్నింటి కన్నా ముఖ్యంగా ఫోన్ ను డ్రై చేసిన తర్వాత ఒకసారి ప్రొఫెషనల్ ద్వారా చెక్ చేయించి ఫోన్ ను ఆన్ చేయండి. ఎందుకంటే, ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే ప్రొఫెషనల్స్ వెంటనే సరి చేస్తారు. లేదంటే, చిన్న సమస్య కారణంగా ఫోన్ పూర్తిగా పాడయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ గోలంతా నాకెందుకు అనుకుంటే మాత్రం నీటిలో ఫోన్ ను సురక్షితంగా ఉండే వాటర్ ప్రూఫ్ కవర్స్ వస్తాయి వాటిని ఉపయోగించడం మంచిది.