గూగుల్ ప్లే స్టోర్ ను ముంచెత్తిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ ఇమిటేషన్స్

గూగుల్ ప్లే స్టోర్ ను ముంచెత్తిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ ఇమిటేషన్స్
HIGHLIGHTS

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్

గూగుల్ ప్లే స్టోర్ లో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ యొక్క ఇమిటేషన్స్ వెల్లువెత్తాయి.

PUBG ఇమిటేషన్స్ యాప్స్ తో జాగ్రత్త

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గురించి ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి వస్తున్న ఈ గేమ్ ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా మొదలుపెట్టింది. అయితే, ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ యొక్క ఇమిటేషన్స్ వెల్లువెత్తాయి. FAUG యాప్ ప్రారంభించనప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందే తలెత్తింది. ఎక్కువ ఇమిటేషన్ యాప్స్ కారణంగా అసలు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ ను గుర్తించడం కొంచెం కష్టంగా మారుతుంది.

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ను పేరును క్యాష్ చేసుకోవడానికి ఈ ఇమిటేషన్ యాప్స్ ప్రయత్నిస్తాయి. కొన్ని యాప్స్ గైడ్ పేరుతొ కనిపిస్తే, కొన్నేమో పేలవమైన ఇతర ఆటలను ప్లే చేసేవిగా ఉంటాయి.ఇవన్నీ కూడా ఎక్కువగా యాడ్స్ ను గుప్పిస్తూ ఒరిజినల్ యాప్వచ్చే లోపుగా వీలైనంత డబ్బును సంపాదించే పనిలో ఉంటాయి.

అదృష్టం బాగా లేకపోతే, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతొ ఏదైనా ఫిషింగ్ సంభందించిన ఏదైనా ఇమిటేషన్ యాప్ ను కనుక డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఇక మీ సమాచారం ఇతరుల చేతికి వెళ్లిపోతుంది. కాబట్టి, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఉన్న ప్రతి యాప్ ని ప్రయత్నించడం మంచిది కాకపోవచ్చు.

ఒరిజినల్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఎలా గుర్తించాలి?

ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా కోసం వెతుకుతున్నప్పుడు మీరు చూడవలసిన ముఖ్యమైన విషయం ఈ గేమ్ డెవలపర్ పేరు అని గుర్తుచుకోండి. PUBG యొక్క మదర్ కంపెనీ Krafton Inc ని మాత్రమే ఒరిజినల్ గా గుర్తించాలి. మిగిలిన వాటికీ దూరంగా ఉండడడం మంచిది.                                                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo