Apple Services Down mac app store itunes store and app store are facing issues
Apple Services Down: ఆపిల్ సర్వీస్ డౌన్ అయినట్లు మరియు యాపిల్ యొక్క కొని సర్వీస్ లలో ఇప్పటికే సమస్యలు చూస్తున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. ఆపిల్ అధికారిక సిస్టం స్టేటస్ పేజీ ప్రకారం, Apple Store, iTunes Store మరియు Mac App Store సర్వీసులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు ఈ సర్వీస్ అంతరాయం ప్రారంభమైనట్లు తెలిపారు. అంతేకాదు, ఈ సర్వీస్ అంతరాయం ఇంకా కొనసాగుతున్నట్లు కూడా సమాచారం.
సర్వీస్ డౌన్ అయిన ప్రతి సారి సోషల్ మీడియా వేదికగా ఎలాగైతే యూజర్లు పోస్టులు పెడతారో, ఈసారి కూడా అసంతృప్తి చెందిన వినియోగదారులు తమ అనుభవాలను పంచుకోవడానికి X (గతంలో ట్విట్టర్) ను ఆశ్రయించారు. యాపిల్ యూజర్లు X నుంచి వారి వారి భాధలను ట్వీట్ చేశారు. ఇందులో కొందరు యాపిల్ యాప్ స్టోర్ పనిచేయకపోవడం నిజంగా దురదృష్టకరం అని వాపోతుంటే ఇంకొందరు, ఏంటి యాపిల్ సర్వీసులు కూడా డౌన్ అవుతాయా అని మరికొందరు వాపోతున్నారు.
ఈ అంతరాయం కారణంగా యూజర్లు యాప్ లను డౌన్‌లోడ్ చేయడం, కొనుగోలు చేయడం మరియు అప్‌డేట్ చేయడం వంటివి చేయలేక పోతున్నట్లు కూడా యూజర్లు చెబుతున్నారు. అలాగే, డిజిటల్ కంటెంట్ కు సంబంధించిన కొన్ని సేవలను ఉపయోగించడంలో కూడా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : LAVA Virat V1 5G ఫస్ట్ డే సేల్ వన్ డే బిగ్ డీల్ మిస్ చేసుకోకండి.!
ప్రస్తుతం ఈ అంతరాయానికి గల కారణాన్ని Apple అధికారికంగా వెల్లడించలేదు. తమ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తోందని మాత్రమే తెలిపింది. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరించబడతాయి అనే విషయం పైన కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఆపిల్ అధికారిక System Status పేజీ ప్రకారం, అంతరాయం ఏర్పడిన అన్ని సేవలు ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. సేవలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. అంతరాయం సమయంలో యాప్ స్టార్ ను ఉపయోగించలేకపోయిన వారు లేదా లావాదేవీలు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు ఇప్పుడు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. యాప్ లను డౌన్‌లోడ్ చేయడం, కొనుగోలు చేయడం, అప్‌డేట్ చేయడం వంటి సేవలు ప్రస్తుతం సజావుగా పనిచేస్తున్నాయి.