SBI ఖాతాదారులకు అలర్ట్.!!
పెరుగుతున్న టెక్నాలజీతో పాటుగా స్మార్ట్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి
SBI ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సంధించిన కొత్త స్కామ్
టెక్స్ట్ మెసేజ్ లింక్ ద్వారా బ్యాంక్ కస్టమర్లను మోసపూరితమైన దారిలోకి మళ్లిస్తున్నారు
పెరుగుతున్న టెక్నాలజీతో పాటుగా స్మార్ట్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో SBI ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సంధించిన కొత్త స్కామ్ ఒకటి బయటపడింది. ఈ నయా స్కామ్ కోసం PAN అప్డేట్ ను ఎరగా వాడుతున్నారు. టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపించే ఒక లింక్ ద్వారా బ్యాంక్ కస్టమర్లను మోసపూరితమైన దారిలోకి మళ్లిస్తున్నారు. అందుకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఇటివంటి మోసాల భారిన పడకుండా సురక్షితంగా ఉండాలని PIB ఫ్యాక్ట్ చెక్ అలర్ట్ జారీచేసింది.
Surveyఎస్‌బిఐ ఖాతాదారులకు స్కామర్లు టెక్స్ట్ మెసేజ్‌లు పంపుతున్నట్లు పిఐబి ఫ్యాక్ట్-చెక్ టీమ్ ఇటీవల కనుగొంది. దీని ప్రకారం ఈ నయా స్కామ్ ఏమిటంటే, మీ SBI YONO అకౌంట్ ను అప్డేట్ చేసుకోవాలని దానికోసం ఈ లింక్ పైన క్లిక్ చెయ్యాలని ఒక మెసేజ్ వస్తుంది. మీ యోనో అకౌంట్ అప్డేట్ చేసి మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చెయ్యాలని ఖాతాదారులను కోరుతున్నారు. అయితే, వాస్తవానికి SBI బ్యాంక్ ఇటువంటి SMS లేదా మరింకేదైనా రిక్వెస్టులను జారీచేయలేదని మరియు వాటిని నమ్మి మోసపోవద్దని అలర్ట్ జారీ చేసింది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే, పైన తెలిపిన విధంగా ఏదైనా టెక్స్ట్ లేదా వాట్సాప్ మెసేజ్ వచినట్లైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దు మరియు ఈ లింక్‌పై క్లిక్ చెయ్యకూడదు.
ఇంకొక మోసపూరితమైన మెసేజ్ కూడా చాలా మంది ఖాతాదారులకు వచ్చినట్లు చెబుతున్నారు. అదేమిటంటే, మీ SBI బ్యాంక్ యొక్క YONO అకౌంట్ డీయాక్టివేట్ చేయబడిందని మరియు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడానికి మీ పాన్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని పేర్కొంటూ టెక్స్ట్ సందేశం వచ్చినట్లు చెబుతున్నారు. ఇది కూడా మోసపూరితమైన మెసేజ్ గా గుర్తించబడింది. కాబట్టి, SBI ఖాతాదారులు ఈ మెసేజ్ స్కామ్ ల గురించి జాగ్రత్త వహించండి.
తాజా ట్వీట్‌లో, PIB ఫ్యాక్ట్ చెక్ ఈ నకిలీ సందేశం గురించి SBI వినియోగదారులను హెచ్చరించింది మరియు వారిని అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile