మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఈ 5 యాప్స్ లో ఏవైనా డౌన్లోడ్ చేసుకొని ఉంటే కనుక వెంటనే తొలిగించండి. యూజర్ల సున్నితమైన డేటాని సేకరిస్తునట్లుగా గుర్తించి ఒక 5 యాప్ లను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఇవి మీ ఫోన్ లో ఉన్నట్లయితే, మీ సున్నితమైన డేటాని సేకరిస్తాయి కాబట్టి ఈ 5 యాప్ లలో ఏవైనా మీ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించడం మంచింది.
Survey
✅ Thank you for completing the survey!
తర్డ్ పార్టీ యాప్స్ తో ఈ సమస్య సర్వసాధారణమే అయినా అప్పుడప్పుడు ప్లే స్టోర్ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. అయితే, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా యాప్ వైరస్ భారిన పడినట్లు గుర్తిస్తే వెంటనే వాటిని ప్లే స్టోర్ నుండి వెంటనే తొలగిస్తుంది.
ఇటీవల కూడా గూగుల్ కొన్ని ప్రముఖ యాప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఈ యాప్స్ యూజర్ల సున్నితమైన డేటాని సేకరించే మాల్వేర్ ను కలిగి ఉన్నట్లుగా గుర్తించిన కారణంగా ఈ యాప్స్ ను తొలిగించింది. వీటిలో కొన్ని యాప్స్ ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి. మీరు కనుక మీ ఫోన్ లో ఈ యాప్ లలో ఏదైనా యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే మీ ఫోన్ నుండి డిలీట్ చేయండి. ఈ క్రింద ఆ యాప్స్ లిస్ట్ చూడవచ్చు.