టాప్ 10 “డిజిటల్ పేమెంట్ స్టేట్స్” లో ఆంధ్రప్రదేశ్ కు 5 వ స్థానం

టాప్ 10 “డిజిటల్ పేమెంట్ స్టేట్స్” లో ఆంధ్రప్రదేశ్ కు 5 వ స్థానం
HIGHLIGHTS

టాప్ 10 డిజిటల్ పేమెంట్ సిటీలలో హైదరాబాద్ కు 5 వ స్థానం

నోట్ల మార్పు తరువాత పుంజుకున్న ఆన్లైన్ డిజిటల్ పెమెంట్స్ ఇప్పుడు ట్రస్టుయికి చేరుకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో డిజిటల్ పేమెంట్స్ నమోదవుతుండగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రము టాప్ 10 రాష్ట్రాలలో 5 వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే, అత్యధికంగా డిజిటల్ చలిపులు చేసే రాష్ట్రంగా, మహారాష్ట్ర మొదటి స్థానాన్ని సాధించింది. అంటే దాదాపుగా అన్ని చెల్లిపులకు కూడా డిజిటల్ చెల్లింపు పద్ధతినే ఉపయోగిచినట్లు చెప్పొచ్చు. భారతదేశంలో నోట్ల మార్పిడి చేపట్టిన తరువాత, ఈ డిజిటల్ చెల్లిపులకు ప్రజలు ఎక్కువగా మల్లించబడినట్లు అర్ధమవుతోంది.

ఇక ఈ టాప్ 10 రాష్ట్రల విషయానికి వస్తే, మహారాష్ట్ర ప్రధమ స్థానాల్లో నిలువగా రెండు మూడు స్థానాలను కర్ణాటక, తమిళనాడు సొంతం చేసుకున్నాయి. ఈ విభాగంలో ఢిల్లీ నాల్గవ స్థానంలో నిలువగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రము 5 వ స్థానంలో నిలిచింది. మిగిలిన 5 స్థానాల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగాల్  మరియు హర్యాణా రాష్ట్రాలు నిలిచాయి.

2017 సంవత్సరానికి గాను 4.6 బిలియన్ ట్రాన్సక్షన్స్ జరుగగా, 2018 సంవత్సరానికి గాను 5.8 బిలియన్ ట్రాన్సక్షన్స్ జరిగాయి. అంటే, ట్రాన్సక్షన్స్ లో 27% వృద్ధిరేటు జరిగినట్లు చెప్పొచ్చు. ముఖ్యంగా, నవంబర్ 4 వ తేదీన సంవత్సరం మొత్తంలో అత్యధికమైన ట్రాన్సక్షన్స్ జరిగాయి. ఈ సమయంలో దీపావళి పండుగ సందర్బముగా అత్యధికమైన క్రయవిక్రయాలు జరిపినట్ల మనం గ్రహించవచ్చు. ఆశ్చర్యంగా, ATM నుండి డబ్బును విత్ డ్రా చేసే వారి సంఖ్యా గణనీయంగా తగ్గిపోయింది. 2017 సంవత్సరంతో పోల్చి చుస్తే , 2018 సంవత్సరంలో ATM విత్ డ్రా చేసేవారి సంఖ్య 26% తగ్గిపోయింది.

ఇక అత్యధికంగా డిజిట్ చెల్లిపులు చేసే సిటీల విషయానికి వస్తే, బెంగుళూరు ప్రధమ స్థానంలో నిలిచింది. భారతదేశ ప్రధాన ఆర్ధిక నగరమైన ముంబాయి రెండవ స్థానం మరియు చెన్నై మూడవ స్థానం సాధించాయి. పూణే నాల్గవ స్థానాన్ని సాధించగా, హైదరాబాద్ ఐదవ స్థానంలో నిలిచింది. మిగిలిన 5 స్థానాల్లో ఢిల్లీ, కలకత్తా, న్యూ ఢిల్లీ , గుడుగావ్, మరియు కోయంబత్తూర్ సిటీలో నిలిచాయి.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo