భారీ డీల్స్ తో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసిన అమెజాన్…!

HIGHLIGHTS

భారీ డీల్స్ తో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వస్తోంది

ఈ సేల్ మే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది

ప్రైమ్ మెంబర్స్ కి 12 గంటల ముందే సేల్ యాక్సెస్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది

భారీ డీల్స్ తో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసిన అమెజాన్…!

భారీ డీల్స్ తో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది మరియు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 12 గంటల ముందే సేల్ యాక్సెస్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్ నుండి అఫర్ చేయనున్న డీల్స్, ఆఫర్స్ మరియు ప్రోడక్ట్స్ గురించి అమెజాన్ టీజింగ్ మొదలు పెట్టింది. అమెజాన్ అప్ అప్ కమింగ్ సేల్ ఎటువంటి అఫర్స్ ను అందించబోతోందో తెలుసుకుందాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ కొత్తగా అనౌన్స్ చేసిన ఈ గ్రేట్ సమ్మర్ సేల్ ను ICICI మరియు Kotak బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువచ్చింది. అందుకే, ICICI మరియు Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ పేమెంట్ మరియు EMI అప్షన్ తో ఈ సేల్ నుండి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది. అంటే, మీరు ICICI మరియు Kotak కార్డ్స్ తో కొనుగోలు చేసే ప్రోడక్ట్స్ పైన 10% తగ్గింపును పొందవచ్చు.  

ఈ సేల్ నుండి Welcome అఫర్ ను కూడా జత చేసింది. ఈ అఫర్ ద్వారా మీరు కొనుగోలు చేసే మొదటి ఆర్డర్ పైన 20% వరకూ క్యాష్ బ్యాక్ ను అందుకోవచ్చని అమెజాన్ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ పేజ్ నుండి అప్ కమింగ్ డీల్స్ ను గురించి చెబుతోంది. అయితే, ఈ ఆఫర్లను ఇంకా వెల్లడించలేదు మరియు ఈ డీల్స్ పైన లాక్ ను కూడా చూపిస్తోంది. ఆఫర్ల కోసం Click Here

అయితే, ఈ సేల్ నుండి ఆఫర్ చెయనున్న కొన్ని డీల్స్ గురించి మాత్రం టీజర్ పేజ్ ద్వారా ఊరిస్తోంది. ఇందులో ముఖ్యంగా Sony Bravia X74L సిరీస్ స్మార్ట్ టీవీలైన (55) & (65) ఇంచ్ టీవీ లను గురించి చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీలను డిస్కౌంట్ ధరతో ఈ సేల్ నుండి అఫర్ చేయబోతున్నట్లు ఊరిస్తోంది. ఈ టీవీ అఫర్ ధరను ఇంకా తెలియ చేయలేదు కానీ, రూ. _ _, 990 ప్రారంభ ధరతో అఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది. 

అలాగే, ఇతర ఆఫర్లను పరిశీలిస్తే, ఈ సేల్ నుండి బ్లాక్ బాస్టర్ డీల్స్, ప్రైస్ క్యాష్ స్టోర్, కిక్ స్టార్ట్ డీల్స్, 8PM డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను ఈ సేల్ నుండి అందించనున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo