రేపే లాస్ట్ డేట్: అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఓల్డ్ రేట్స్ కి రేపే లాస్ట్ డేట్

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఓల్డ్ రేట్స్ కి రేపే లాస్ట్ డేట్

అమెజాన్ ప్రైమ్ కొత్త రేట్లు డిసెంబర్ 14 వ తేదీ నుండి మొదలవుతాయి

డిసెంబర్ 13 తరువాత అన్ని ప్లాన్స్ కూడా సగానికి సగం పెరగబోతున్నాయి

అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఓల్డ్ రేట్స్ కి రేపే లాస్ట్ డేట్. అమెజాన్ ప్రైమ్ కొత్త రేట్లు డిసెంబర్ 14 వ తేదీ నుండి మొదలవుతాయి. అంటే, మీరు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కేవలం రూ.999 రూపాయలకే రేపు ఒక్కరోజు పొందవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కోసం చూస్తున్నట్లయితే రేపటి లోగా తీసుకోండి. డిసెంబర్ 13 తరువాత అన్ని ప్లాన్స్ కూడా సగానికి సగం పెరగబోతున్నాయి.

అంటే, నెలవారీ, మూడు నెలల ప్లాన్‌ తో సహా వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ధరలను కూడా పెంచడానికి డేట్ ఫిక్స్ చేసింది అమెజాన్. అందుకే, చవక ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే డిసెంబర్ 13 తేదీ లోపల సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.  

అయితే, వాస్తవానికి ఇప్పటివరకూ చవక ధరలో ఎక్కువ లాభాలను అందిస్తున్న సంస్థగా అమెజాన్ నిలుస్తుంది. ఎందుకంటే, కేవలం రూ. 999 రూపాయలకే అమెజాన్ సబ్ స్క్రిప్షన్  ను అఫర్ చేస్తోంది. దీనితో, అద్భుతమైన స్ట్రీమింగ్‌, ఉచిత డెలివరీ సర్వీస్ ను కూడా అఫర్ చేస్తోంది. కానీ, ఈ ధర వద్ద నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ లేదా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం అలాంటి సేవలను అందించడం లేదు.

ఇక అమెజాన్ వెబ్ సైట్ పరిశీలించినట్లయితే, కొత్త అప్డేట్ లో మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ను రూ .329 కి బదులుగా రూ .459 ధరలో చూపిస్తోంది. ఇక నెలవారి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కోసం రూ .129 కి బదులుగా రూ .179 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ పాత ధరల్లో అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ అందుకున్న కస్టమర్లు ముందు ముందు రోజుల్లో కొత్త రేట్లు చెల్లించాల్సి వస్తుంది.

అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కొత్త ధరలను డిసెంబర్ 14 నుండి అమలు చేస్తుంది. అంతేకాదు, ధరలు మరిన తరువాత కస్టమర్ల కార్డు నుండి ఆటోమేటిక్‌గా ఎలాంటి ఛార్జ్ తీసుకోబోమని కూడా కంపెనీ తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :