Amazon Prime సబ్ స్క్రిప్షన్ రేటు 50% పెంచబోతున్నట్లు అమెజాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్రస్తుతం కేవలం రూ.999 రూపాయలకు మాత్రమే అఫర్ చేస్తుండగా, ఇక్క ముందు 50% రేటు పెరిగితే రూ.1,499 రూపాయలు చెలించవలసివస్తుంది. ఇది మాత్రమే కాదు నెలవారీ మరియు మూడు నెలల ప్లాన్‌ల ధరలను కూడా పెంచబోతున్నట్లు అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది. ఈ విషయంగా వినియోగధారులు చాలా అసంతృప్తిగా ఉండవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
అయితే, వాస్తవానికి ప్రస్తుత చవక ధరలో ఎక్కువ లాభాలను అందిస్తున్న సంస్థగా అమెజాన్ నిలుస్తుంది. ఎందుకంటే, కేవలం రూ. 999 రూపాయలకే అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ను అఫర్ చేస్తోంది. దీనితో, అద్భుతమైన స్ట్రీమింగ్, ఉచిత డెలివరీ సర్వీస్ ను కూడా అఫర్ చేస్తోంది. కానీ, ఈ ధర వద్ద నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ లేదా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం అలాంటి సేవలను అందించడం లేదు.
ఇక అమెజాన్ వెబ్ సైట్ పరిశీలించినట్లయితే, కొత్త అప్డేట్ లో మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ను రూ .329 కి బదులుగా రూ .459 ధరలో చూపిస్తోంది. ఇక నెలవారి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కోసం రూ .129 కి బదులుగా రూ .179 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ పాత ధరల్లో అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ అందుకున్న కస్టమర్లు ముందు రోజుల్లో కొత్త రేట్లు చెల్లించాల్సి వస్తుంది.
అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కొత్త ధరలను ఎప్పటి నుండి అమలు చేయనున్నది అనే విషయాన్ని అమెజాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అంతేకాదు, ధరలు మరిన తరువాత కస్టమర్ల కార్డు నుండి ఆటోమేటిక్‌గా ఎలాంటి ఛార్జ్ తీసుకోబోమని కూడా కంపెనీ తెలిపింది.