Amazon Prime Day: అధిక డిస్కౌంట్ అఫర్ లతో వస్తోంది

HIGHLIGHTS

Amazon Prime Day సేల్ ను ప్రకటించింది

అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ జూలై 23న ప్రారంభమవుతుంది

ఈ అతిపెద్ద సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన అధిక డిస్కౌంట్ అఫర్ లను అందిస్తుంది

Amazon Prime Day: అధిక డిస్కౌంట్ అఫర్ లతో వస్తోంది

అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే Amazon Prime Day సేల్ ను ప్రకటించింది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ జూలై 23న ప్రారంభమవుతుంది. ముందుగా US, UK మరియు ఇతర దేశాలలో జూలై 12న నిర్వహించబడుతుంది. అయితే, భారతదేశంలో మాత్రం జూలై 23-24 తేదీ లలో నిర్వహించబడుతుంది. అమెజాన్ నిర్వహించనున్న ఈ అతిపెద్ద సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన అధిక డిస్కౌంట్ అఫర్ లను అందిస్తుంది. ఈ అప్ కమింగ్ సేల్ కోసం మైక్రో సైట్ పేజ్ ను కూడా ఇప్పటికే అలాట్ చేసింది మరియు సేల్ డిస్కౌంట్ లను గురించి కూడా టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Prime Day సేల్ సమయంలో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్స్ మరియు మరిన్ని విభిన్న కేటగిరీలలో 30,000 కొత్త ప్రోడక్ట్ లను  లాంచ్‌ చేయాలని కూడా చూస్తుంది.

Amazon Prime Day సేల్ ను ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. తద్వారా, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లాభాలను అందించగలగుతుంది. అంటే, Amazon Prime Day సేల్ నుండి ICICI లేదా SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లతో వస్తువులను కొనుగోలు చేస్తే వారికి 10% అదనపు తగ్గింపు లభిస్తుంది.

ఇక టీజర్ పేజ్ ద్వారా అందించిన డిస్కౌంట్ వివరాల్లోకి వెళితే, Amazon Prime Day సేల్ నుండి అమెజాన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మరియు టీవీల పైన గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, మొబైల్స్ పైన 40%, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సూచించింది. మంచి ల్యాప్ టాప్ లేదా హెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Amazon Prime Day సేల్ మంచి సమయం కావచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి ల్యాప్ టాప్ మరియు హెడ్ ఫోన్ వంటి మరిన్ని గ్యాడ్జెట్స్ పైన గరిష్టంగా 75% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు చెబుతోంది. 

ఇక Amazon Prime Day సేల్ యొక్క మరిన్ని ఆఫర్ల విషయానికి వస్తే, సేల్ జరగనున్న రెండు రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య 'WoW Deals' అందుబాటులో ఉంటుంది. అలాగే, కిచెన్ సామానులు హోమ్ డెకరేషన్ వస్తువుల పైన కూడా 70% డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్, Prime Day సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలుపెట్టింది.

&

 

Amazon Prime Day అంటే ఏమిటి?

అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ప్రతి సంవత్సరం అమెజాన్ నిర్వహించే వార్షిక సేల్

Amazon Prime Day 2022 సేల్ ఎప్పుడు జరగనుంది?

భారతదేశంలో జూలై 23-24 తేదీ లలో Amazon Prime Day 2022 సేల్ నిర్వహించబడుతుంది. అమెజాన్ నిర్వహించనున్న ఈ అతిపెద్ద సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన అధిక డిస్కౌంట్ అఫర్ లను అందిస్తుంది.

Amazon Prime Day 2022 సేల్ నుండి ఎవరు షాపింగ్ చేయవచ్చు?

Amazon Prime Day 2022 సేల్ కేవలం ప్రైమ్ సభ్యుల కోసం మాత్రమే నిర్వహించబడుతుంది. మీరు ఈ సేల్ నుండి అధిక డిస్కౌంట్ తో షాపింగ్ చేయాలంటే Amazon Prime సభ్యత్వం తీసుకోవలసి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo