అమెజాన్ ప్రైమ్ డే నుండి ఈ ప్రోడక్ట్స్ పైన 70% భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు..!!

HIGHLIGHTS

అమెజాన్ ప్రతీ సంవత్సరం తీసుకువచ్చే అతిపెద్ద సేల్ 'Prime Day'

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సేల్ 2022 సేల్ జూలై 23న ప్రారంభమవుతుంది

కొన్ని ప్రోడక్ట్ ల పైన గరిష్టంగా 70% డిస్కౌంట్ అఫర్

అమెజాన్ ప్రైమ్ డే నుండి ఈ ప్రోడక్ట్స్ పైన 70% భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు..!!

అమెజాన్ ప్రతీ సంవత్సరం తీసుకువచ్చే అతిపెద్ద సేల్ 'Prime Day' ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ నుండి ప్రైమ్ సభ్యుల కోసం భారీ డిస్కౌంట్ తో అనేక ప్రోడక్ట్ లను అందిస్తుంది. అమెజాన్ ఈ ప్రైమ్ డే సేల్ ను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుంది మరియు భారతదేశంలో ఈ సేల్ 2022 సేల్ జూలై 23న ప్రారంభమవుతుంది. అయితే,  ఈరోజు నుండి US, UK వంటి ఇతర దేశాలలో నిర్వహించబడుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక భారతదేశం విషయానికి వస్తే, ఈ సేల్ జూలై 23-24 తేదీ లలో నిర్వహించబడుతుంది. ఈ సేల్ నుండి కొన్ని ప్రోడక్ట్ ల పైన గరిష్టంగా 70% డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. మరి అమెజాన్ భారీ డిస్కౌంట్ తో అందించనున్న ప్రోడక్ట్స్ కేటగిరిల గురించి ఈరోజు తెలుసుకుందాం.     

Amazon Prime Day సేల్ సమయంలో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్స్ మరియు మరిన్ని విభిన్న కేటగిరీలలో 30,000 కొత్త ప్రోడక్ట్ లను  లాంచ్‌ చేయాలని కూడా చూస్తుంది.

Amazon Prime Day సేల్ ను ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. తద్వారా, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లాభాలను అందించగలగుతుంది. అంటే, Amazon Prime Day సేల్ నుండి ICICI లేదా SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లతో వస్తువులను కొనుగోలు చేస్తే వారికి 10% అదనపు తగ్గింపు లభిస్తుంది.

ఇక టీజర్ పేజ్ ద్వారా అందించిన డిస్కౌంట్ వివరాల్లోకి వెళితే, Amazon Prime Day సేల్ నుండి అమెజాన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మరియు టీవీల పైన గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, మొబైల్స్ పైన 40%, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సూచించింది. మంచి ల్యాప్ టాప్ లేదా హెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Amazon Prime Day సేల్ మంచి సమయం కావచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి ల్యాప్ టాప్ మరియు హెడ్ ఫోన్ వంటి మరిన్ని గ్యాడ్జెట్స్ పైన గరిష్టంగా 75% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు చెబుతోంది.

ఇక Amazon Prime Day సేల్ యొక్క మరిన్ని ఆఫర్ల విషయానికి వస్తే, సేల్ జరగనున్న రెండు రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య 'WoW Deals' అందుబాటులో ఉంటుంది. అలాగే, కిచెన్ సామానులు హోమ్ డెకరేషన్ వస్తువుల పైన కూడా 70% డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్, Prime Day సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలుపెట్టింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo