అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ బిగ్ డీల్: iQOO Z6 5G పైన భారీ అఫర్.!

HIGHLIGHTS

అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ అఫర్

1,000 రూపాయల అమెజాన్ కూపన్ తో పాటుగా మరిన్ని ఆఫర్లతో లభిస్తోంది

EMI అప్షన్ తో కొనేవారికి 1,250 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది

అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ బిగ్ డీల్: iQOO Z6 5G పైన భారీ అఫర్.!

అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ అఫర్ ప్రకటించింది. కేవలం బడ్జెట్ ధరలో వచ్చిన ఈ iQOO స్మార్ట్ ఫోన్ ఈ అమెజాన్ సేల్ నుండి మరింత తక్కువ ధరకు లభిస్తోంది. 2022 మార్చి లో రూ.15,999 ప్రారంభ ధరలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుండి 500 రూపాయల డిస్కౌంట్ మరియు 1,000 రూపాయల అమెజాన్ కూపన్ తో పాటుగా మరిన్ని ఆఫర్లతో లభిస్తోంది. iQOO Z6 5G పైన అమెజాన్ అందించిన అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z6: ధర

ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ఈ సేల్ నుండి కేవలం రూ.15,499 రూపాయల ధరతో లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ కూడా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 1,250 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. Buy From Here

 iQOO Z6: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 6 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 1445 mm² 5-లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా  2MP మ్యాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo