అమెజాన్ Kick Starter సేల్ నుండి iQOO Z6 Pro 5G పైన బిగ్ డీల్స్ ప్రకటించింది. ఐకు యొక్క లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఐకూ Z6 ప్రో అమెజాన్ కిక్ స్టార్ట్ సేల్ నుండి మంచి ఆఫర్లతో అందుబాటులో వుంది. లేటెస్ట్ ఫీచర్లను కలిగి సమంజసమైన ధరలో లభిస్తున్న ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ కూడా ఒక మంచి ఎంపిక అవుతుంది. HDR 10+ సర్టిఫికేషన్ కలిగిన AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ పైన అమెజాన్ కిక్ స్టార్ట్ సేల్ నుండి అందించిన ఆఫర్లు,ధర మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.
ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ రూ.23,999 రూపాయలు. అలాగే, 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.28,999 . BuyFrom Here
Offer: అమెజాన్ కిక్ స్టార్ట్ సేల్ నుండి ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,750, క్రెడిట్ కార్డ్ EMI పైన 1,500, డెబిట్ కార్డ్ తో కొనేవారికి 750 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఐకూ జెడ్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.44 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 2100 mm² వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.
ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ కెమెరా మరియు 4cm మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్ లను ఆకర్షించడానికి, Z6 ప్రో 4D లీనియర్ వైబ్రేషన్ మోటార్ ని జతచేసింది.