అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 వస్తోంది..భారీ ఆఫర్లు తెస్తోంది.!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 వస్తోంది
అమెజాన్ యొక్క అతిపెద్ద అప్ కమింగ్ సేల్
ప్రైమ్ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే యాక్సెస్ అందుతుంది
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 వస్తోంది మరియు మీకోసం భారీ ఆఫర్లు తెస్తోందని, అమెజాన్ అనౌన్స్ చేసింది. అమెజాన్ యొక్క ఈ అతిపెద్ద అప్ కమింగ్ సేల్ జనవరి 15 వ తేదీ నుండి జనవరి 20 వ తేదీ వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను అందించబోతున్నట్లు, అమెజాన్ టీజింగ్ ద్వారా వెల్లడిస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కోసం కూడా ప్రైమ్ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే యాక్సెస్ అందుతుంది. ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ సంగతులు తెలుసుకుందామా.
Surveyఅమెజాన్ తీసుకువస్తున్న అప్ కమింగ్ సేల్ Amazon Great Republic Day 2023 సేల్ నుండి మంచి ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇందులో అప్ కమింగ్ డీల్స్ లో భాగంగా బ్లాక్ బాస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుక్ మరియు 8PM డీల్ వంటివి ఉంటాయని వెల్లడించింది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. అందుకే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారికీ 10% అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తుంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి టీవీలు మరియు గృహోపకరణాల పైన గరిష్టంగా 65% వరకూ డిస్కౌంట్ అందించనున్నట్లు సేల్ టీజింగ్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అలాగే, Alexa, FireTv మరియు Kindlle వంటి సొంత ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 45% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా చెబుతోంది.
ఇక కొత్త ప్రోడక్ట్స్ మరియు లాంచెస్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి 60 కి పైగా కొత్త ప్రోడక్ట్స్ సేల్ కి అందుబాటులో ఉంటాయని మరియు మంచి ఆఫర్లు కూడా ఈ ప్రోడక్ట్స్ పైన అందుకోవచ్చని తెలుస్తోంది. ఇందులో, కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, సౌండ్ బార్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile