అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 3 రేపటి నుండి మొదలు : ప్రైమ్ మెంబర్లకు ఈరోజే నుండే యాక్సెస్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 3 రేపటి నుండి మొదలు : ప్రైమ్ మెంబర్లకు ఈరోజే నుండే యాక్సెస్
HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఈ సేల్ ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

అమెజాన్ ఇండియా యొక్క మొదటి మరియు రెండవ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసి ఎన్నోరోజులు గడవకుండానే, మరోసారి కంపెనీ తదుపరి సేల్ ని ప్రకటించింది. ఈ సేల్  అక్టోబర్ 21 న ప్రారంభమై అక్టోబర్ 25 వరకు కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఈ సేల్  ఈరోజు నుండే  ప్రారంభమవుతుంది. ఈ సేల్ కోసం Axis మరియు Citi బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది, దీని కింద వినియోగదారులకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చేసిన కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సేల్ సమయంలో, మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్‌లలో గొప్ప డీల్స్  మరియు ఆఫర్‌లను పొందుతారు.

ఈ సేల్ సమయంలో, స్మార్ట్‌ ఫోన్లకు 40% వరకు తగ్గింపు లభిస్తుంది మరియు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, NoCost  EMI మొదలైన ప్రయోజనాలు కూడా చేర్చబడతాయి. అలాగే,  ఆపిల్, షావోమి , వన్‌ప్లస్, శామ్‌సంగ్, వివో, హానర్ వంటి బ్రాండ్ల ఫోన్‌లలో మంచి డీల్స్ అందించబడతాయి.

ఇ-కామర్స్ దిగ్గజం గృహోపకరణాలకు 60% వరకు తగ్గింపుతో పాటు NoCost  EMII, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇన్స్టాలేషన్ మరియు ఉచిత డెలివరీ మొదలైనవి లభిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo